ప్రపంచానికి సవాల్ విసురుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అనుకూల దేశాలు ముందుకు కదులుతున్నాయా? జపాన్ ఇందుకు నాయకత్వం వహిస్తోందా? దక్షిణ, మధ్య ఆసియా, ఆఫ్రికా మధ్య భారత్ వారధిగా మారుతుందా? అంటే అవునని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ/టోక్యో : చైనా అర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంలో భాగంగా నిర్మిస్తున్న ఒన్ బెల్ట్ ఒన్ రోడ్‌కు ప్రత్యామ్నాయాలను జపాన్ ముందుకు తీసుకువస్తోంది. అందులో భాగంగా భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలతో కలిసి జపాన్ వ్యూహాత్మక బాగస్వామ్యాన్ని తెరమీదకు తీసుకువస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జపాన్ ప్రధాని షింజో అబె ప్రతిపాదిస్తారని జపాన్ విదేశాంగ శాఖ మంత్రి టాకో కోనో తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అబె, ట్రంప్‌ల మధ్య నవంబర్6న సమావేశం జరగనుంది.
జపాన్ చేస్తున్న తాజా ప్రతిపాదనతో నాలుగు దేశాలకు సముద్ర, వాయు మార్గాల్లో స్వేచ్ఛా వాణిజ్యం, రక్షణ సహకారానికి మార్గం సుగమం అవుతుంది. అంతేకాక దక్షిణ, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాకు దీనిని విస్తరించవచ్చని జపాన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. అంతర్జాతీయ వ్యూహాత్మక దౌత్య విధానంలో జపాన్ కొత్త శకానికి నాంది పలికిందని ఆయన చెప్పారు. వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఆర్థిక, రక్షణ వ్యవస్థలు మరింత బలోపేతమవుతాయని ఆయన అన్నారు. ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ నిర్మాణంతో చైనా గ్లోబెల్ లీడర్‌గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే 60 దేశాల్లో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతోందని ఆయన తెలిపారు.
ఆసియా-ఆఫ్రికా మధ్య..
ఆసియా-ఆఫ్రికా మధ్య అత్యంత పటిష్టమైన మౌలిక వసతుల కల్పన వల్ల చైనాకు ఎకనమిక్ కారడార్‌లకు చెక్ పెట్టొచ్చని జపాన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. భారత్-అమెరికాలు సహజ స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. జపాన్-భారత్ మధ్య మొదటి నుంచి స్నేహ సంబంధాలున్నాయని చెప్పారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి రెక్స్ టెల్లర్‌సన్‌తో సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. దక్షిణాసియా వ్యూహాత్మక భాగస్వామ్యంలో పాలుపంచుకుంటామని ప్రకటించారు.
పలు దేశాల ఆసక్తి
జపాన్ చేసిన వ్యూహాత్మక ప్రాజెక్ట్‌పై ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు సైతం ఈ బారీ ప్రాజెక్టులో సహకారమందిస్తాయని ప్రకటించాయి.
ఎవరికీ పోటీ కాదు
ఈ ప్రాజెక్టుపై భారత్ విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్ స్పందిస్తూ.. ఇది ఎవరికీ పోటీ కాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment