
స్కూల్‌కు టైమ్‌కు వెళ్లాలా.. ఈ బస్సెక్కండి..
ఇదో స్కూల్ బస్సు.. పేరు ‘స్కూల్ టైం’. ఇదెక్కితే స్కూల్‌కు ఆలస్యమవడం వంటివి ఉండవు. దీని అత్యధిక వేగం గంటకు 590 కిలోమీటర్లు మరి! అమెరికాలో ఇండియాకు చెందిన ఇంజనీర్ పాల్ స్టెండర్ దీన్ని తయారు చేశారు. దీని వేగానికి కారణం.. జెట్ ఇంజిన్. చూశారుగా ఎలా నిప్పులు కక్కుతుందో.. అదే సమయంలో డీజిల్ బాగా తాగేస్తుంది.. ప్రస్తుతం ఈ బస్సు అమెరికా అంతటా పర్యటిస్తూ.. అందరినీ ఆకర్షిస్తోంది.