పిల్లలకు పేరు పెట్టేటప్పుడు బోలెడన్ని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఏ పేరైతే పిలవడానికి బాగుంటుంది, ఏ పేరైతే కలిసి వస్తుందంటూ వంద లెక్కలు వేస్తారు. పిల్లలకు పేర్లు పెట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒకప్పుడైతే ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి పెట్టామా? అంటే పేరు పెట్టేసేవాళ్లు. కానీ ఇప్పుడు పేరు పెట్టాలంటే పుస్తకాలు చూసి, ఇంకెన్నో రిసెర్చ్‌లు చేసి మరీ పెడుతున్నారు?. అయితే కొన్ని దేశాల్లో మన లెక్కలు పని చేయవు. ఎందుకంటే... కొన్ని పేర్లను ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. మనకి ఎంత నచ్చినా కూడా ఆ లిస్టులో పేరు కనుక పెట్టామో ఆ పేరును నిషేధించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. తాజాగా ఫ్రెంచ్ దేశంలోని ఒక జంట వారి సంతానానికి ఇలానే పేరు పెట్టారు. అయితే ఈ వ్యవహారం చివరకూ కోర్టు మెట్లు కూడా ఎక్కింది.
వివరాల్లోకి వెళితే....గత నవంబర్‌లో ఓ ఫ్రెంచ్ జంట తల్లిదండ్రులయ్యారు. వారికి కలిగిన ఆడ సంతానానికి లియామ్ అని నామకరణం చేశారు. అయితే అది మగవారి పేరు అని, ఆ పేరు ఆమెకు భవిష్యత్తులో నష్టం చేకూర్చేలా ఉందనీ ఒక ప్రాసిక్యూటర్ కోర్టులో కేసు వేశారు. ఆ చిన్నారి పేరును మార్చాలనీ, న్యాయస్థానమే ఆ పాపకు సరైన పేరును సూచించాలని వేడుకున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఆ జంట కూడా కేసు వేసింది. తమకు ఇష్టమైన పేర్లు పెట్టుకోవడం ఈ కాలంలో సర్వసాధారణమే అయినా..ఫ్రెంచ్ ప్రభుత్వం మాత్రం పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. అక్కడ కొన్ని పేర్లుపై నిషేధం కూడా ఉంది. ఆ దేశ చట్టం ప్రకారం పిల్లల అభిష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ పేర్లు పెడితే వాటిని రద్దు చేసే అధికారం న్యాయస్థానానికి ఉంది. ఇంతకీ కోర్టు ఆ చిన్నారికి మరి ఏ పేరు పెడుతుందో..
Comments
Please login to add a commentAdd a comment