'అదే పెద్ద సమస్య.. త్వరలో పరిష్కారం!' | Kashmir is the main cause of tension between India and Pakistan, says Nawaz Sharif | Sakshi
Sakshi News home page

'అదే పెద్ద సమస్య.. త్వరలో పరిష్కారం!'

Published Wed, Sep 23 2015 4:08 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'అదే పెద్ద సమస్య.. త్వరలో పరిష్కారం!' - Sakshi

'అదే పెద్ద సమస్య.. త్వరలో పరిష్కారం!'

ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రధాన సమస్య కశ్మీరేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పక్కపక్కనే ఉన్న ఈ దేశాలను సుదీర్ఘంగా వేధిస్తున్న ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. 'మొత్తం సమస్య కశ్మీరే. ఇది తప్పక పరిష్కరించవలసిన అంశం. రెండు దేశాలు త్వరలోనే దీన్ని పరిష్కరించే పనులు ప్రారంభిస్తాయని నేననుకుంటున్నాను.

ఈ విషయం కేవలం అంతర్జాతీయ వేదికల్లో చర్చించడమే కాదు. పాకిస్థాన్-భారత్ ద్వైపాక్షిక వేదికలపై కూడా చర్చించాలి' అని షరీఫ్ అన్నారు. న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 70వ సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు బ్రిటన్ వచ్చిన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొననున్న విషయం తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement