జీవులుండే గ్రహం జాడ తెలిసింది! | kepler 62f Planet May Have Active Life | Sakshi
Sakshi News home page

జీవులుండే గ్రహం జాడ తెలిసింది!

Published Sat, May 28 2016 12:59 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

జీవులుండే గ్రహం జాడ తెలిసింది! - Sakshi

జీవులుండే గ్రహం జాడ తెలిసింది!

వాషింగ్టన్: జీవుల ఉనికికి ఆస్కారమున్న గ్రహాన్ని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిలో ముందడుగు పడినట్లు కనిపిస్తోంది. భూమి నుంచి 1,200 కాంతి సంవత్సరాల దూరంలో శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ గ్రహంపై జీవులు నివసించడానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లు భావిస్తున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కెప్లర్-62f అనే గ్రహంపై పరిశోధనలు నిర్వహించి జీవుల ఉనికి పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. భూమి కంటే 40 శాతం అధిక బరువుతో ఉన్న ఈ గ్రహంపై కావాల్సిన మోతాదులో  ఉష్ణోగ్రతలు ఉండటం మూలంగా సముద్రాలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుని కంటే తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉన్న ఓ నక్షత్రాన్ని కేంద్రంగా చేసుకొని పరిబ్రమిస్తున్న కెప్లర్-62f.. ఆ నక్షత్ర గ్రహమండలంలో ఐదో, చివరి గ్రహంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ గ్రహంపై ఉన్నటువంటి వాయువుల మిశ్రమాలు, కక్ష్య ఆకృతి లాంటి వివరాలను పరిశోధకులు నిర్థారించాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement