
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కిమ్
బీజింగ్, చైనా : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ చైనాలో కనిపించారు. సర్‌ప్రైజ్ విజిట్‌తో అందర్నీ ఆయన ఆశ్చర్యపర్చారు. భార్యతో కలసి ప్రత్యేక విమానంలో ఉత్తరకొరియా నుంచి డాలియన్ నగరానికి చేరుకున్న ఆయన్ను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కలిశారు.
ఇరువురు నేతలు సముద్రతీరంలో నడుచుకుంటూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చిలో ప్రత్యేక రైలులో కిమ్ బీజింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు, అణు ఆయుధాగారం మూసివేత వంటి ఘటనల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని జిన్‌పింగ్‌తో కిమ్ చర్చించినట్లు చైనా మీడియా పేర్కొంది.