ఐర్లాండ్: స్కాటిష్ హైలాండ్స్‌లోని లోచ్‌నెస్ సముద్ర తీరంలో సరదాగా విహరిస్తున్న ఓ యాత్రికుడికి ఇటీవల ముచ్చెమటలు పట్టించే దృశ్యమొకటి కనిపించింది. సముద్ర రాకాసిగా పేరొందిన ‘నెస్సీ’ అతని కంటబడింది. ఐర్లాండ్‌కు చెందిన ఫౌడాగేన్ తీరం అందాల్ని తన కెమెరాలో బంధించే క్రమంలో సముద్ర జలాల్లో ఈత కొడుతున్న నెస్సీ కనిపించింది. పెద్ద తల, పొడవైన మెడతో వికృత రూపంతో ఉండే ఈ జలచర జీవిని పేరు వింటేనే ఐరోపా వాసులు భయంతో వణికిపోతారు.
అలాంటిది 10 నిమిషాల నిడివి గల వీడియోలో నెస్సీ రాకాసిని చూసిన ఐరోపా ప్రజలకు నిద్ర పట్టడం లేదు. గతంలో నెస్సీని చూశామని, వికృత రూపంలో ఉన్న ఆ రాకాసి ఓ మనిషిని సముద్రంలోకి లాక్కెళ్లిందనే కథనాలు వచ్చాయి. దాదాపు 150 లక్షల సంవత్సరాలుగా నెస్సీ లోచ్‌నెస్ ప్రాంతంలోని సముద్ర తీరాల్లో తిరుగుతోందని అక్కడి ప్రజల నమ్మకం.
భయం పెంచిన ఫోటో..
1934లో రాబర్ట్ కెన్నెత్ విల్సన్ అనే డాక్టర్.. నెస్సీ ఫోటోను ప్రపంచానికి పరిచయం చేశారు. దాంతో అక్కడి ప్రజల భయాలు మరింత పెరిగాయి. అయితే విల్సన్ బయటిపెట్టిన నెస్సీ ఫోటో నకిలీ అని 1974లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి ఆ సముద్ర రాకాసి గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. కానీ, 2017లో నెస్సీని చూశామంటూ మళ్లీ కథనాలు వెలువడడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఇప్పుడు ఏకంగా ఆ రాకాసి సముద్రంలో ఈదుతున్న వీడియో బయటపడడంతో జనం గుండెల్లో గుబులు మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment