
‘దాడి చేసింది బ్రిటన్ జాతియుడే’
బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తి బ్రిటీష్ పౌరుడేనని ఆ దేశ ప్రధాని థెరిసా మే చెప్పారు. ఈ విషయం తనకంటే నిఘా వర్గాలకే ఎక్కువగా తెలుసని అన్నారు.
లండన్: బ్రిటన్ పార్లమెంటుపై దాడికి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తి బ్రిటీష్ పౌరుడేనని ఆ దేశ ప్రధాని థెరిసా మే చెప్పారు. ఈ విషయం తనకంటే నిఘా వర్గాలకే ఎక్కువగా తెలుసని అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం దాడికి పాల్పడిన వ్యక్తినే గతంలో ఎంఐ5 ఇంటెలిజెన్స్ విభాగం విచారించిందని, గతంలో కూడా అతడు తీవ్రవాదం తాలుకు చర్యలకు పాల్పడిట్లు గురువారం పార్లమెంటులో చెప్పారు.
‘నేను ఏం స్పష్టం చేయగలనంటే పార్లమెంటుపై దాడికి యత్నించిన వ్యక్తి బ్రిటన్ సంతతివాడే. కొన్నేళ్లకిందట అతడిని ఇంటెలిజెన్స్ విభాగం విచారించింది కూడా. ఈ విషయం వారికే బాగా తెలుసు’ అని గురువారం తెలిపారు. ఉగ్రవాదం ఎట్టిపరిస్థితుల్లో పై చేయి సాధించరాదని అన్నారు. ఇలాంటి సమయంలోనే మొత్త బ్రిటీషు జాతి మనోధైర్యంగా ఉంటూ మన విలువలను సంరక్షించుకోవాలని అన్నారు. ఇలా చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని తేలికగా ఓడించవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.