లండన్‌లోని అంబేద్కర్ ఇల్లు 35 కోట్లు
అంబేద్కర్ ఇల్లు 35 కోట్లు, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, వినోద్ తవ్డే
కొనుగోలుకు మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22 మధ్య లండన్‌లో నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2,050 చదరపు అడుగులతో మూడంతస్తుల్లో ఉన్న ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తవ్డే లండన్‌కు వెళ్లారు.
ఈ భవంతిని రూ.35 కోట్లకు కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వినోద్.. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు చెప్పారు. ఈ భవనాన్ని అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 నుంచి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా ఈ భవంతి కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కొద్దిరోజుల కిందట లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇది అంబేద్కర్ అభిమానులు, మహారాష్ట్ర ప్రజల ఉద్వేగానికి సంబంధించినదని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై దళిత సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.