
ప్రతీకాత్మక చిత్రం
మెక్సికో : భారీ భూకంపంతో మెక్సికో వణికిపోయింది. శుక్రవారం రాత్రి నగరానికి 200 మైళ్ల దూరంలోని దక్షిణ పసిఫిక్ తీరంలో ఈ భూకంపం సంభవించింది. రిక్చర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది.
భూకంపం దాటికి ఓక్సాకా రాష్ట్రంలోని పినోటేపా నసియోనల్ పట్టణంలో తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెక్సికో నగరంలో భవనాలు రెండు నిమిషాల పాటు కుదుపునకు గురయ్యాయి. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇండ్లనుంచి వీధులకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టవివరాలు తెలియాల్సి ఉంది.
గత సెప్టెంబర్‌లో మెక్సికోలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 1985లో సంభవించిన భారీ భూకంపం 10 వేల మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి భూకంపంతో ప్రజలు భీతిల్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment