మెక్సికోలో భారీ భూకంపం
Published Fri, Sep 8 2017 12:14 PM | Last Updated on Tue, Sep 12 2017 2:16 AM
మెక్సికో: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ మెక్సికోలో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 8.0 గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మెక్సికో తీరంలోని ట్రెస్పికోకు 119 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు పేర్కొంది.
సముద్రగర్భంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో మెక్సికో సిటీలోని భవనాలు బీటలు వారాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. దాదాపు నిమిషమన్నర పాటు భవనాలు కంపించాయని స్థానికులు తెలిపారు.
Advertisement