మెక్సికోలో భూకంపం
మెక్సికో: మెక్సికోలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. వాయువ్య మెక్సికోలోని బాజా కాలిపోర్నియాలోని టూరిస్ట్ రిసార్ట్ రీజియన్ ప్రాంతం నుంచి స్టేట్ ఆఫ్ సినోలా మధ్యలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
సినోలాకు నైరుతి వైపున 59 కిలో మీటర్ల దూరంలో10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారని తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. మెక్సికోలోని బాజా కాలిపోర్నియాకు మంచి పర్యాటక ప్రాంతంగా పేరుంది. అమెరికా, ప్రపంచ నలుమూలల నుంచి ప్రతి ఏటా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.