నేపాల్‌లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం | missed flight risk in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Thu, Mar 5 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

నేపాల్‌లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

నేపాల్‌లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

కఠ్మాండు: నేపాల్‌లో టర్కీ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం తెల్లవారుజామున నేపాల్‌లోని కఠ్మాండు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతూ పట్టు తప్పి పక్కకు జారింది. దట్టమైన పొగమంచు వల్ల రన్‌వే పైన సరిగా ల్యాండ్ కాలేక పచ్చికపైన నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో 227 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. వారందరినీ అత్యవసర ద్వారం గుండా అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రతికూల వాతావరణం, పొగమంచు వల్ల రన్ వే సరిగా కనిపించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు.  ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతిన్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement