missed risk
-
మంత్రి హరీష్‌రావుకు తప్పిన ప్రమాదం
సాక్షి, సిద్ధిపేట: మంత్రి హరీష్‌రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. అడవి పంది అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. హరీష్‌రావు కాన్వాయిలో ముందు వెళ్తున్న కారుకు అడవి పంది అడ్డు వచ్చింది. ముందున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో హరీష్‌రావు పైలెట్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. హరీష్‌రావు మరో కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. హరీష్‌రావు వాహనం ముందు భాగం ధ్వంసమైంది. కొండపాక మండలం బందారం దర్గా కమాన్ సమీపంలో ప్రమాదం జరిగింది. -
నేపాల్‌లో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
కఠ్మాండు: నేపాల్‌లో టర్కీ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి బయలుదేరిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం తెల్లవారుజామున నేపాల్‌లోని కఠ్మాండు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతూ పట్టు తప్పి పక్కకు జారింది. దట్టమైన పొగమంచు వల్ల రన్‌వే పైన సరిగా ల్యాండ్ కాలేక పచ్చికపైన నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో 227 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. వారందరినీ అత్యవసర ద్వారం గుండా అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రతికూల వాతావరణం, పొగమంచు వల్ల రన్ వే సరిగా కనిపించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతిన్నది.