సాక్షి, సిద్ధిపేట: మంత్రి హరీష్‌రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. అడవి పంది అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. హరీష్‌రావు కాన్వాయిలో ముందు వెళ్తున్న కారుకు అడవి పంది అడ్డు వచ్చింది. ముందున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో హరీష్‌రావు పైలెట్ కారు ఢీకొంది.
ఈ ప్రమాదంలో ముందు కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. హరీష్‌రావు మరో కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. హరీష్‌రావు వాహనం ముందు భాగం ధ్వంసమైంది. కొండపాక మండలం బందారం దర్గా కమాన్ సమీపంలో ప్రమాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment