లియామ్‌తో మొబైల్ రీసైక్లింగ్
వాడేసిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లతో ఎలక్ట్రానిక్ వ్యర్థ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి... తగిన విధంగా రీసైకిల్ చేయకపోతే భూమి, గాలి, నీరు మరింత కలుషితమవుతుందని ఆందోళన చెందుతున్న వారందరికీ ఇదో శుభవార్తే. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్..ఈ సమస్యకు ఓ రోబోతో చెక్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఫొటోలో కనిపిస్తున్నది ఆ రోబోనే.
పేరు లియాం. స్టోర్స్‌లోకి తిరిగి వచ్చిన ఐఫోన్లను ఏ భాగానికి ఆ భాగాన్ని విడదీసి అవసరమైన వాటిని మళ్లీ వాడుకునేందుకు, సులువుగా రీసైకిల్ చేసేందుకు దీన్ని వాడుకోవాలని ఆపిల్ నిర్ణయించింది. మొత్తం 29 రోబో ప్లాట్‌ఫామ్స్ ఉన్న లియామ్ ఏక కాలంలో 40 వరకూ ఐఫోన్లను రీసైకిల్ చేయగలదు. గట్టిగా బిగించిన స్క్రూలను విడదీయడం మొదలుకొని, ఫోన్ బ్యాటరీల్లోని రసాయనాలను వేరు చేయడం వరకూ... అన్ని కఠినమైన, సంక్లిష్టమైన పనులు చేపట్టేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. మరిన్ని వివరాలకు... ఆసక్తికరమైన ఈ వీడియో చూడండి.... https://www.youtube.com/watch?v=AYshVbcEmUc