భారత పారిశ్రామికాభివృద్ధిలో అప్పటి సోవియట్ యూనియన్ చేసిన సాయం మరువలేనిదని ప్రధాని ప్రశంసించారు. మిలటరీ సాంకేతికత రంగంలో సహకారం భారత–రష్యా బంధాలకు బలమైన పునాది. రష్యన్ పరికరాలు, సాంకేతికతే మా భద్రతా విభాగంలో కీలకం. ప్రస్తుతం సాఖాలిన్ 1, వాంకోర్, తాస్–యుర్యాఖ్ చమురు క్షేత్రాల్లో భారత పెట్టుబడులు, సాంకేతిత.. కూడంకుళం అణువిద్యుత్ ప్లాంటు, బ్రహ్మోస్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టులో భాగస్వామ్యం మా దోస్తీకి నిదర్శనం’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఉగ్రపోరులో ‘సహజ’ భాగస్వామ్యం
Published Thu, Jun 1 2017 2:52 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
భారత్–రష్యా సంబంధాలపై మోదీ
సెయింట్ పీటర్స్‌బర్గ్: ఉగ్రవాదంపై పోరులో భారత్–రష్యాలు సహజ భాగస్వాములని ప్రధాని మోదీ తెలిపారు. రష్యా పర్యటన సందర్భంగా ఆ దేశ పత్రిక ‘రోసీయిస్‌కాయా గజెటా’లో మోదీ వ్యాసం రాశారు. ‘అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల నేపథ్యంలోనూ 1947 నుంచి భారత్–రష్యా మధ్య స్థిరమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లోనూ, సుఖదుఃఖాల్లోనూ మేం కలిసే ఉన్నాం. సమానత్వం, విశ్వాసం, పరస్పర ప్రయోజన సిద్ధాంతాల ఆధారంగానే మా దృఢమైన బంధుత్వం కొనసాగుతోంది’ అని మోదీ వ్యాసంలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement