ఈ ఏనుగుకు తొమ్మిదో కాలు..
బ్యాంకాక్: థాయ్లాండ్లో మందుపాతర పేలి కాలు పోగొట్టుకున్న ఏనుగు మోషాకు తొమ్మిదో కృత్రిమకాలును అమర్చారు. దశాబ్దం క్రితం థాయ్లాండ్, మయన్మార్ సరిహద్దులో మోషా మందుపాతరపై కాలుపెట్టడంతో అది పేలింది. ఈ ప్రమాదంలో ఏనుగు ముందుకాలు పొగొట్టుకుంది. అప్పుడు మోషా వయసు ఏడు నెలలు.
ఈ తర్వాత కృత్రిమకాలు సాయంతో మోషా నడవగలుతోంది. ఇప్పటి వరకు 8 కాళ్లను అమర్చారు. ఈ వారం ఆసియన్ ఎలిఫెంట్ ఫౌండేషన్ ఆస్పత్రి తొమ్మిదో కాలును అమర్చింది. మయన్మార్ సరిహద్దులో మందుపాతర్లు పేలి 12 ఏనుగులు గాయపడ్డాయి. కాగా తొలిసారి కృత్రిమఅవయం అమర్చింది మోషాకే. ప్రమాదంలో మోషా గాయపడినపుడు 1300 పౌండ్ల బరువు ఉండగా, ప్రస్తుతం 4 వేల పౌండ్లకుపైగా బరువుంది.
ప్రమాదంలో వైకల్యం చెందిన ఏనుగులకు కృత్రిమ అవయవాలు తయారు చేసేందుకు థాయ్లాండ్ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ థెర్డ్చాయ్ సాయపడ్డారు. కృత్రిమ అవయవాలు లేకుంటే గాయపడ్డ ఏనుగులను కాపాడటం కష్టం. థాయ్లాండ్లో 2 వేల నుంచి 3 వేల వరకు ఏనుగులు ఉన్నట్టు అంచనా. థాయ్లాండ్లో గతంలో దుంగల రవాణకు ఏనుగులను వాడేవారు. కాగా 1989లో థాయ్లాండ్ ప్రభుత్వం దుంగల రవాణకు ఏనుగులను వాడకుండా నిషేధం విధించింది.