ముస్లిం బ్రదర్‌హుడ్ చీఫ్‌కు మరణ దండన
కైరో: నిషేధిత ముస్లిం బ్రదర్‌హుడ్‌కు ఈజిప్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హింస ప్రేరేపణ, హత్య తదితర కేసుల్లో ఆ సంస్థ చీఫ్ మహ్మద్ బడీతో పాటు 21 మందికి ఇక్కడి కోర్టులు మరణ దండన విధించాయి. 2013 ఆగస్టులో రబా, నహడా ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి తమ మద్దతు దారులను రెచ్చగొట్టి హింసకు పురిగొల్పడమే కాకుండా, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు సృష్టించారనే కేసులో బడీతో పాటు మరో పదముగ్గురిని దోషులుగా కైరో క్రిమినల్ కోర్టు తేల్చింది. తుది తీర్పును వచ్చేనెల 11న కోర్టు వెల్లడించనుంది. హింస ప్రేరేపిత కేసుల్లోనే మన్సోరాలోని క్రిమినల్ కోర్టు మరో ఎనిమిది మంది ముస్లిం బ్రదర్‌హుడ్ సభ్యులకు మరణ దండన విధించింది. ఈ తీర్పులను పునఃపరిశీలనకు ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీకి కోర్టుల నివేదించాయి.