భార్యపై ప్రేమకు 15 కారణాలు | my wife more attracted me with 15 reasons, says tim murphy | Sakshi
Sakshi News home page

భార్యపై ప్రేమకు 15 కారణాలు

Published Fri, Dec 11 2015 5:06 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

భార్యపై ప్రేమకు 15 కారణాలు - Sakshi

భార్యపై ప్రేమకు 15 కారణాలు

లాస్ ఏంజెలిస్: పెళ్లికి ముందు ప్రేమించడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. పెళ్లి తర్వాత భార్యను ప్రేమించాలంటే మాత్రం కారణాలు వెతుక్కోవాలి. నగరంలో ఇంజనీరుగా పనిచేస్తున్న టిమ్ మర్ఫీ తన భార్య పట్ల తనకున్న ప్రేమానురాగాలను వ్యక్తం చేయడానికి 15 కారణాలు వెతుక్కున్నారు. వాటిని బెడ్‌రూమ్‌లోని అద్దంపై రాసి మానసిక సంక్షోభంలో కొట్టుకుపోతున్న భార్యను రక్షించుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆన్‌లైన్ హీరోగా మారారు.


 భార్యను ప్రేమించడానికి టిమ్ వ్యక్తం చేసిన కారణాలివే.....
 1. ఆమె నాకు మంచి స్నేహితురాలు.
 2. ఆమెగానీ, నేనుగానీ ఎప్పటికీ విడిపోము.
 3. నా క్రేజీ ప్రాజెక్టులపై పనిచేసుకోవడానికి ఆమె నాకు కావల్సినంత సమయం ఇస్తోంది.
 4. ప్రతిరోజు ఆమె నన్ను నవ్విస్తుంది.
 5. ఆమె చాల అందమైనది.
 6. నేనెంత క్రేజీ పర్సన్ అయినప్పటికీ ఆమె సహిస్తోంది.
 7. నాకు తెలిసిన వాళ్లలో ఆమె దయగల తల్లి.
 8. ఆమె గొంతు కోకిల కంఠం.
 9. ఆమె నాతో స్ట్రిప్ క్లబ్‌కు కూడా వచ్చింది.
 10. ఆమె అంతులేని విషాదాన్ని అనుభవించింది. అయినా మానవత్వం పట్ల ఆమెకున్న ఆశాభావం అపారం.
 11. కెరీర్‌లో నాకు వచ్చిన అన్ని అవకాశాలకు అండగా నిలబడింది. ప్రతిసారి నా వెన్నంటే నడిచింది.
 12. నేను ఎప్పుడూ ఎవరికి చేయని సేవ, ఆమెకు చేసేలా చేసింది.
 13. ఆమె కెరీర్ దూసుకెళుతూ అద్భుతమైన జాబ్ చేస్తోంది.
 14. బుల్లి జంతువులు కూడా ఆమెను ఏడిపించేవి.
 15. ఆమె పగలబడి నవ్వినప్పుడు ఆయాసంతో రొప్పుతుంది.
 ‘ఇవి నేను నా భార్య మొల్లీ మర్ఫీని ప్రేమించడానికి కారణాలు’ అన్న శీర్షిక కింద బెడ్ రూమ్ అద్దంపై టిమ్ మర్ఫీ రాసిన పంక్తులను ఆయన భార్య చూసి ఛలించిపోయింది. కన్నీళ్ల పర్యంతమైంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే ముందు భర్తతో గొడవ పడినందుకు బాధ పడింది. ఆనందం లాంటి విషాధంలో ధారాపాతంగా కన్నీళ్లు కార్చింది. దిండంతా తడిపేసింది. తేలికైన హృదయంతో లేచి అద్దంపై భర్త రాసిన వ్యాక్యాలను సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి ‘ఇమ్గూర్’ అనే సోషల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దాన్ని మూడు రోజుల్లోనే దాదాపు ఆరులక్షల మంది వీక్షించారు.
 వాస్తవానికి తన భార్యను ఉద్దేశించే తానీ వ్యాక్యాలు రాశానని, కనీసం ఆమైనా చూస్తుందన్న నమ్మకం తనకు లేకుండేనని, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చూశారని, ఇది ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతకన్నా ఆశ్చర్యం తన భార్య తనను ఉదయాన్నే నిద్రలేపి పలకరిస్తోందని టిమ్ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. ఇది వరకు తాను తెలియని మానసిక క్షోభతో అస్తమానం భర్తతో గొడవ పడేదాన్నని, బాత్‌రూమ్‌లోకి వెళ్లి గంటల తరబడి గడియవేసుకొని అలా ఉండిపోయేదాన్నని మొల్లీ తన గురించి వెల్లడించింది. తాను ఇప్పటికీ మానసికంగా పూర్తిగా కోలుకోలేదని, తన భర్త తనకు అండగా ఉండగా, తప్పనిసరిగా కోలుకుంటానన్న పూర్తి విశ్వాసం తనకుందని ఆమె చెప్పారు. తాను ప్రతిరోజు లేవగానే అద్దంపై టిమ్ రాసిన వ్యాక్యాలను చదువుతానని, తాను ఇంకేమాత్రం ఒంటరిదాన్ని కాదన్న తృప్తి క లుగుతోందని తాజా పోస్ట్‌లో ఆమె తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement