అలాంటివాడు దొరికితే వెంటనే పెళ్లి! | Priyanka Chopra Did Bajirao Mastani For This Man | Sakshi
Sakshi News home page

అలాంటివాడు దొరికితే వెంటనే పెళ్లి!

Published Tue, Dec 1 2015 8:03 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

అలాంటివాడు దొరికితే వెంటనే పెళ్లి! - Sakshi

అలాంటివాడు దొరికితే వెంటనే పెళ్లి!

‘‘మీరు ఎవరో వ్యక్తితో ప్రేమలో పడ్డారట?... మీ పెళ్లెప్పుడు?... మీకు ఎలాంటి వాడు కావాలి’’... కథానాయికలు కనబడగానే మీడియా సంధించే ప్రశ్నలే ఇవి. చాలామంది  ‘పెళ్లి చేసుకున్నప్పుడు మీకు చెప్పే చేసుకుంటా’ అని అసలు విషయం దాటేసి, తెలివిగా తప్పించుకుంటారు. కత్రినా కైఫ్, అనుష్కా శర్మ లాంటి బాలీవుడ్ కథానాయికలు ఇలాంటి ప్రశ్నలు అడిగినవాళ్లకు నిర్మొహమాటంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు కూడా. కానీ ప్రియాంకా చోప్రా మాత్రం తనకు ఇలాంటి ప్రశ్నలంటే చాలా ఇష్టమని అంటున్నారు.

పైగా తనకు ఎలాంటి భర్త కావాలో, అతనికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో ఓపెన్‌గా చెప్పేశారు.  ఈ బ్యూటీ ఓ యూఎస్ బిజినెస్ మ్యాన్‌తో ప్రేమలో ఉన్నారని బాలీవుడ్  కోడై కూస్తోంది. ఈ వార్త గురించి విలేకరులు ప్రియాంకను అడిగితే - ‘‘నాకు ఎవరితోనో ఎఫైర్ ఉందని రాస్తుంటారు. ఇలాంటి వార్తలు వినీ వినీ బోర్ కొట్టేసింది కూడా. మీరు ఎప్పుడెప్పుడు అడుగుతారా? దాని గురించి వివరణ ఇద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా.

కరెక్ట్ టైంలో అడిగారు. నాకు ఎవరితోనూ ఎఫైర్ లేదు. కానీ నాకంటూ కొన్ని రిక్వైర్‌మెంట్స్ ఉన్నాయి. నాక్కాబోయే భర్త చాలా ఉత్సాహంగా ఉండాలి. ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడాలంటే  అస్సలు భయపడకూడదు. ఒక విధంగా చెప్పాలంటే షో మ్యాన్‌లా ఉండాలి. అలాంటి వాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను’’ అని చెప్పుకొచ్చారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement