చైనా - ఇండియా యోగా సదస్సు ప్రారంభం | Namaste: Sino-Indian Yoga Conference Kicks off in China | Sakshi
Sakshi News home page

చైనా - ఇండియా యోగా సదస్సు ప్రారంభం

Published Wed, May 18 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

చైనా - ఇండియా యోగా సదస్సు ప్రారంభం

చైనా - ఇండియా యోగా సదస్సు ప్రారంభం

బీజింగ్ : భంచిక్ భంచిక్ చెయ్యి బాగా...  ఒంటికి యోగా మంచిదేగా అంటూ చైనీయులు యోగా చేసేందుకు మహా ఉత్సహాం చూపిస్తున్నారు. ఆ క్రమంలో చైనా కున్మింగ్లోని చైనా - ఇండియా కాలేజీలో బుధవారం చైనా - ఇండియా యోగా సదస్సు ప్రారంభమైంది. అందులోభాగంగా యోగా కోర్సులోని వివిధ అంశాలను భారతీయ యోగా మాస్టర్లు చైనీయులకు వెల్లడిస్తున్నారు. ఈ యోగాలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారు.

ఈ సదస్సు విదేశీ వ్యవహారాలు, ప్రవాసీ చైనా వ్యవహారాల కార్యాలయం సంయుక్తంగా  స్థానిక పురపాలక ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ఇటీవల కాలంలో చైనాలో యోగాకు అంతకంతకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్లో ది చైనా - ఇండియా యోగా కాలేజీని కున్మింగ్లో ప్రారంభించారు. దాదాపు 4 వేల మందికి పైగా చైనీయులు ఈ కళాశాలలో ఉచితంగా యోగా నేర్చుకుంటున్నారు. ఈ సదస్సు ఆదివారంతో ముగియనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement