36 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలు
* ఫ్రాన్స్‌తో 17 ఒప్పందాలు
* జైతాపూర్ అణుకేంద్రంపై తొలగిన ప్రతిష్టంభన
పారిస్: భారత వాయుసేన అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కార్యక్షేత్రంలో దూకడానికి సిద్ధంగా ఉన్న 36 రఫల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్‌తో శుక్రవారం ద్వైపాక్షిక చర్చల తర్వాత ఆయన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 126 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడేళ్లుగా భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరుగుతున్న చర్చల్లో అధిక ధరపై ప్రతిష్టంభన ఏర్పడింది.
ఇరు ప్రభుత్వాల మధ్య ప్రత్యక్షంగా జరిగిన ఈ ఒప్పందంలో భాగంగా సాధ్యమైనంత త్వరగా వాటిని పంపించాలని హోలండ్‌ను కోరినట్లు మోదీ తెలిపారు. భారత్‌కు ఫ్రాన్స్ అత్యంత విలువైన మిత్రదేశాల్లో ఒకటని అభివర్ణించారు. మోదీ, హోలండ్ చర్చల్లో 17 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మహారాష్ట్రలోని జైతాపూర్‌లో ఆగిపోయి ఉన్న అణు కేంద్ర నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం అందులో ఒకటి. భారత్‌కు చెందిన ఎల్ అండ్ టీ, ఎన్‌పీసీఐల్.. ఫ్రాన్స్‌కు చెందిన అరెవాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
మిగతా ఒప్పందాలు: భారత పర్యాటకులకు 48 గంటల్లో వీసా జారీ పథకాన్ని అమలు చేయనున్న ఫ్రాన్స్. భారత్‌లో 100 కోట్ల డాలర్ల ఫ్రాన్స్ పెట్టుబడులు