ఇండియన్ అమెరికన్‌కు తొమ్మిదేళ్ల జైలు
వాషింగ్టన్ : క్రెడిట్ కార్డుల్లోని సమాచారం చోరీ చేసి దాదాపు రూ.166.96 కోట్లకుపైగా (25 మిలియన్ డాలర్లు) మోసాలకు పాల్పడిన భారత అమెరికన్ అమిత్ చౌదరి (44)కి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని వర్జీనియా కోర్టు తీర్పు వెలువరించింది.
2016 సెప్టెంబర్‌లో అభియోగాలను అంగీకరించడంతో 27.38 కోట్ల(4.1 మిలియన్ డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు. భారత సంతతికి చెందిన అమిత్ చౌదరి.. 2011లో అమెరికా పౌరుడయ్యాడు. క్రెడిట్ కార్డుల్లోని సమాచారం దొంగిలించి వందలాది బ్యాంకు ఖాతాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మనీలాండరింగ్ కుట్ర పన్నారని తీర్పులో కోర్టు పేర్కొంది.