హ్యాంగోవర్ లేని మద్యం వస్తుందోచ్..!
ఉత్తరకొరియా: మద్యం ప్రియులకు ఇక పండగే. మున్ముందు రోజుల్లో వారు ఎంతైనా తాగి ఊగే అవకాశం కలగనుంది. ఎంత తాగినా వారికి ఇక పొద్దున్నే హ్యాంగోవర్ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే హ్యాంగోవర్ పుట్టించని మద్యాన్ని తాము తయారు చేసినట్లు, ఇది ప్రపంచంలోని మొట్టమొదటిదని ఉత్తర కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
తాము తయారుచేసిన మద్యం ప్రస్తుతం తాగే మద్యంకన్నా మరింత మధురంగా ఉంటుందని, దానిని మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడేలా చేస్తుందని, అంతేకాకుండా అది సేవించిన వారిని సౌమ్యంగా మారుస్తుందని వివరించారు. చీనా దేశానికి చెందిన ఓ చెట్టు మూలిక దినుసుల నుంచి తాము ఆ మద్యాన్ని కనుగొన్నట్లు చెప్పారు. కిరియో లిక్కర్ గా పిలిచే ఈ డ్రింక్ ను ఉత్తర కొరియాలోని ప్రభుత్వం నడుపుతున్న టాడాగాంగ్ ఫుడ్ స్టఫ్ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారని వివరించారు. ఇక్కడే చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు పనిచేసి ప్రయోగాలు చేసి విజయం సాధించినట్లు పేర్కొన్నారు.