న్యూఢిల్లీ : అమెరికా, అంతర్జాతీయ సమాజానికి ఉత్తర కొరియా ఏ మాత్రం భయపడడం లేదు. భవిష్యత్లో దుశ్చర్యలకు పాల్పడితే.. దేశాన్ని సమూలంగా నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఉత్తర కొరియా ఏ మాత్రం జంకడం లేదు. అమెరికాకు దీటు బదులిచ్చేందుకు తాజాగా ఉత్తర కొరియా సమాయత్తం అవుతోంది.
అమెరికాను భయపెట్టే స్థాయిలో శక్తివంతమైన హైడ్రోజన్ బాంబ్‌ను కొరియా పసిఫిక్ మహాసముద్రంలో పరీక్షించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి రి యోంగ్ హూ ప్రకటించారు. ఈ బాంబ్ పరీక్షతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ లక్ష్యం పూర్తవుతుందని ఆయన చెప్పారు.
అణుకార్యక్రమాన్ని కిమ్ మొదలు పెట్టిన సమయంలో.. అంతర్జాతీయంగా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్న అంశంపై తాము భయపడ్డట్టు చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి సాక్షిగా ట్రంప్ 26 లక్షల ప్రజలతో ఉన్న దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తానని హెచ్చరించడంతో.. మేం సరైన దిశలోనే వెళుతున్నట్లు అర్థమైందన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన మానసిక స్థితి సరిగ్గాలేదన్న విషయం అర్థమవుతుందని చెప్పారు. అణ్వస్త్రదేశంతో మాట్లాడే సమయంలో ట్రంప్.. జాగ్రత్తా మాట్లాడాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రి యోంగ్ హూ హెచ్చరించారు.
హైడ్రోజన్ బాంబును పసిఫిక్ మహాసముద్రంపై పరీక్షించాలని మేం మొదట అనుకోలేదు.. ఒక వేళ పరీక్షిస్తే మాత్రం.. అందుకు అందుకు అమెరికా, దాని మిత్రపక్షాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ’మా దగ్గరున్న ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ హవాంగ్ -12, హవాంగ్ -14తో పసిఫిక్‌తో కల్లోలం చేయగలమని.. విదేశాంగ శాఖ మంత్రి రి యోంగ్ హూ స్పష్టం చేశారు.
- హైడ్రోజన్ బాంబు పరీక్షిస్తాం
- అమెరికాకు అల్టిమేటం ఇచ్చిన ఉత్తర కొరియా
- బెదిరింపులకు భయపడమని ప్రకటన