'పెంట్హౌజ్ మీద నుంచి పడ్డ పారిశ్రామికవేత్త' | NRI Industrialist Swraj Paul's Son Angad Plunges to Death From London Penthouse | Sakshi
Sakshi News home page

'పెంట్హౌజ్ మీద నుంచి పడ్డ పారిశ్రామికవేత్త'

Published Tue, Nov 10 2015 10:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

'పెంట్హౌజ్ మీద నుంచి పడ్డ పారిశ్రామికవేత్త'

'పెంట్హౌజ్ మీద నుంచి పడ్డ పారిశ్రామికవేత్త'

లండన్: ఎన్నారై పారిశ్రామిక వేత్త స్వరాజ్ పాల్కు పుత్ర శోకం కలిగింది. ఆయన కుమారుడు కపారో గ్రూప్ సీఈవో అంగద్ పాల్ ఎనిమిదంతస్తుల భవనం మీద ఉన్న పెంట్ హౌజ్ నుంచి పడి తీవ్రగాయాలపాలై ప్రాణాలుకోల్పోయారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సాధారణ మరణంగా భావించలేమని అందుకే అనుమానిత మృతిగా కేసు నమోదుచేసుకున్నామని లండన్ పోలీసులు తెలిపారు. ఇటీవల ఉక్కు ధరలు అమాంతం పడిపోవడంతో వారి కంపెనీ కపారో తీవ్ర ఒడిదుడుకుల్లోకి వెళ్లిపోయింది.

దాదాపు ఈ కంపెనీకి చెందిన 16 కార్యాలయాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పదేళ్ల కిందట ఓ మీడియా సంస్థకు న్యాయవాదిగా పనిచేస్తున్న మెషెల్లీ బోన్ అనే మహిళను అంగద్ పాల్ వివాహం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 40 కంపెనీలు, పది వేలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీల్లో కార్లకు సంబంధించిన పనిముట్లు, స్టీలు పైపులు, డిజైనింగ్ వస్తువులు, ఫిల్మ్ లు తయారవుతుంటాయి. కంపెనీ ఆర్థిక సమస్యలు మధ్య ఉండగా ఆయన ఎనిమిదో అంతస్తు మీద నుంచి పడి ప్రాణాలుకోల్పోవడం ప్రస్తుతం అనుమానం కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement