న్యూయార్క్ : కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో న్యూయార్క్‌లో బ్రాంక్స్ సమీపంలోని ఓ ద్వీపం(హార్ట్ ఐలాండ్)లో సామూహిక ఖననం చేశారు. భారీగా కరోనా మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులుగానీ, తెలిసిన వారుగానీ ఎవరూలేకుండానే అంత్యక్రియలను నిర్వహించారు. (‘ఆసుపత్రి బయటే కరోనా శవాలు’)
ఇప్పటి వరకు న్యూయార్క్ నగరంలోనే దాదాపు 1 లక్షా 59 వేల మంది కరోనా బారిన పడగా దాదాపు 7067 మంది మృతిచెందారు. ఇక అమెరికా వ్యాప్తంగా 4,68,703 మందికి కరోనా సోకగా, 16, 679 మంది
మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా 16 లక్షల మందికి కోరానా సోకగా, 95 వేల మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment