ఫ్రీ-వైఫైతో ముగ్గురిలో ఒకరు..
ఫ్రీ-వైఫైతో ముగ్గురిలో ఒకరు..
Published Sun, Jul 23 2017 3:17 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM
న్యూఢిల్లీ: భారత్‌లో ఫ్రీ వైఫైతో కనీసం ముగ్గురిలో ఒకరు అడల్ట్ చిత్రాలనే చూస్తున్నారని నార్టన్ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో హోటల్స్, ఎయిర్‌పోర్టు, లైబ్రరీ, వర్కింగ్ ప్లేస్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫ్రీ-వైఫైని మంచి కన్నా చెడుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిసింది. భారత్‌లో సగటున ముగ్గురిలో ఒకరైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురిలో ఒకరు ఫ్రీ-వైఫైని దుర్వినియోగం చెస్తున్నారని నార్టన్ సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ-వైఫై అడ్మిన్‌లపై నిర్వహించిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిపింది.
భారత్‌లో ఫ్రీ-వైఫై ఉపయోగించే వెయ్యి మంది అడ్మిన్‌లపై స్టడీ చేయగా ఈ విస్తుపోయే విషయం వెల్లడైందని తెలిపింది. భారత్‌లోని వీధుల్లో ఫ్రీ వైఫై ఉపయోగించే వారిలో 31 శాతం అశ్లీల చిత్రాలు చూస్తున్నారని, బుస్సు, రైల్వే స్టేషన్‌లలో 34 శాతం , లైబ్రరీల్లో 24 శాతం , ఎయిర్‌పోర్టుల్లో 34 శాతం మంది చూస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందని నార్టన్ పేర్కొంది. సైబర్ సెక్యూర్ లేని ఫ్రీ వైఫైలతో సోషల్ మీడియాను, వ్యక్తిగత కార్యకలపాలను నిర్వహిస్తున్నారని తెలిపింది.
Advertisement