Norton Study
-
పారా హుషార్: కొత్త ఏడాది.. కొత్త ఆశలతో పాటు కొత్త సమస్యలు
ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి తేరుకుంటోంది! కానీ..ఏళ్లుగా పీడిస్తున్న హ్యాకింగ్, స్కామింగ్ చికాకులు మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేవు సరికదా... వచ్చే ఏడాది మరింత పెరుగుతాయంటోంది నార్టన్ ల్యాబ్స్!! కొత్త పోకడలతో, కొంగొత్త పద్ధతులతో ఐటీ వినియోగదారుల నుంచి డబ్బు లాగేసేందుకు స్కీములేస్తారని... పారాహుషార్ అని హెచ్చరిస్తోందీ సంస్థ! సాక్షి, హైదరాబాద్: 2021కు ముగుస్తోంది. కొత్త ఏడాది.. కొత్త ఆశలతోపాటు... కొత్త సమస్యలు కూడా ఉండబోతున్నాయన్నది నిపుణుల మాట. సైబర్ సెక్యూరిటీ విషయంలో రానున్న 12 నెలలు ఎంతో ఆసక్తికరమని అంటోంది ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ల్యాబ్స్. క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం దక్కుతున్న తరుణంతో దీన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వాళ్లూ ఎక్కువవుతారని, అకాల వర్షాలు, వరదల్లో చిక్కుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ స్కామర్లు కొంగొత్త స్కీములు రచిస్తారని అంచనా వేస్తోంది. అంతేకాదు.. వీటన్నింటి విరుగుడే లక్ష్యంగా సైబర్ ఆక్టివిజమ్ కూడా ఊపందుకుంటుందని చెబుతోంది. 2022 సంవత్సరంలో సైబర్ ప్రపంచంలో సంభవించగల ఐదు అంశాలు.. నార్టన్ ల్యాబ్స్ అంచనాల మేరకు... క్రిప్టో కరెన్సీ తోడుగా... 2022లో క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల వినియోగానికి అంగీకరించే కంపెనీలు పెరుగుతాయి. అదే సమయంలో ఈ డిజిటల్ కరెన్సీ తీరుతెన్నులు తెలియని అమాయకులను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కాయిన్లు ఉచితంగా ఇస్తున్నామని కొందరు, నకిలీ యాప్‌లతో ఇంకొందరు ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఆధారిత నేరాలకు పాల్పడుతుండగా.. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త కుయుక్తులు పన్నే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐడీలు? వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ కాల్, ఆన్లైన్లో అవసరమైనవి తెప్పించుకోవడం... కరోనా కారణంగా ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిన కార్యక్రమాలివి. ఈ క్రమంలోనే స్మార్ట్ఫోన్లతో అవసరమైన డాక్యుమెంట్లను అటూ ఇటూ పంపుతుండటమూ కద్దు. అయితే వీటితో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో మరింత సురక్షితమైన రీతిలో మన వ్యక్తిగత వివరాలను పంపేందుకు వాటిని గుర్తించే అవసరం ఏర్పడింది. కంప్యూటర్ రంగంలో ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం వచ్చే ఏడాది జరగనుంది. ఎల్రక్టానిక్ ఐడీ లేదా ‘ఈఐడీ’ పేరుతో బ్లాక్‌చెయిన్ ఆధారిత గుర్తింపు కార్డుల జారీకి కొన్ని ప్రభుత్వాలూ పట్టుబడుతున్నాయి. సైబర్ నిరసనలు, ఉగ్రవాదమూ... సైబర్ టెర్రరిజమ్, ఆక్టివిజమ్ 2021లోనూ భారీగానే నడిచింది. కాకపోతే వచ్చే ఏడాది ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కోసం నేరాలకు పాల్పడటం సైబర్ క్రిమినల్స్ చేసే పనైతే.. హ్యాకింగ్ మాత్రం కొన్నిసార్లు నిరసనలకూ ఉపయోగపడుతున్నాయి. హ్యాక్టివిస్టులంటారు ఇలా నిరసనలకు పాల్పడే వారిని! ఈ రకమైన హ్యాక్టివిజమ్ వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ప్రభుత్వాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. నేరగాళ్లకూ అండగా ఏఐ... మానవాళి మరికొంచెం సుఖంగా ఉండేందుకు కృత్రిమ మేధ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చే ఏడాది ఈ అత్యాధునిక టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల పని కూడా సులువు చేయనుంది. డీప్‌ఫేక్ వంటి టెక్నాలజీల కారణంగా అసలు, నకిలీల మధ్య అంతరం చెరిగిపోతుండటాన్ని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు. కష్టాల్లో డబ్బులేరుకునే రకాలు... మనిషి కష్టాలతో కూడా డబ్బులు సంపాదించుకునే రకాలు 2022లో మరింత ఎక్కువవుతారు. చోరీ చేసిన సమాచారం సాయంతో ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బు లాగేసేందుకు వీరు ప్రయత్నిస్తారు. చదవండి: సైబర్ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్ మీకోసమే.. ఎందుకింత గలీజ్ అయితున్నరు? పోలీసులకు రవి ఫిర్యాదు -
‘కరోనా’తో ఆన్లైన్ వ్యసనం!..సర్వేలో భయాంకర నిజాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలిగొన్న కరోనా మహమ్మారి గత ఏడాదిన్నర కాలంలో చాలా మందిని ఆన్లైన్ బానిసలుగానూ మార్చిందని తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్... ‘నార్టన్ లైఫ్‌లాక్’ పేరుతో ఇటీవల వివిధ దేశాల్లో ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా భారతీయుల విభాగంలో సుమారు వెయ్యి మందిపై చేపట్టిన అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్లైన్ వ్యసనానికి బానిసలయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆన్లైన్ ద్వారా ఆఫీసు కార్యకలాపాలు, డిజిటల్ చదు వులు వెచ్చిస్తున్న సమయమే కాకుండా అదనంగా కనీసం నాలుగు గంటలపాటు ఆన్లైన్లో గడుపుతున్నట్లు దాదాపు 82 శాతం మంది తెలిపారు. వాటిల్లోనూ స్మార్ట్ఫోన్లతో గడిపే కాలం ఎక్కువైందని తెలిపిన వారు 84 శాతం వరకూ ఉండటం గమనార్మం. సర్వే చేసిన వాళ్లల్లో సగం మంది భద్రతాపరమైన కారణాల రీత్యా ఇంటికి సరికొత్త స్మార్ట్ పరికరాలను కొనడం లేదని స్పష్టం చేశారు. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్న స్పృహ మూడొంతుల మంది (74%)లో ఉండటం ఇంకో విశేషం. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం ఉంటుందని చెప్పినవారు దాదాపు 55 శాతం. అదే సమయంలో బంధుమిత్రులతో మాట్లాడటం ద్వారా స్క్రీన్కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని 76 శాతం మంది చెప్పడం గమనార్హం. ప్రైవసీ భయాలు ఇళ్లలో ఉండే స్మార్ట్ హోం పరికరాల ద్వారా వ్యక్తిగత సమాచారం బట్టబయలవుతుందన్న ఆందోళన నార్టన్ కంపెనీ సర్వే చేసిన ప్రతి ఐదుగురిలో ఇద్దరు భావిస్తున్నారు. భద్రతపరమైన కారణాలతో స్మార్ట్ హోం పరికరాలను కొనబోమని 48 శాతం మంది చెబితే ప్రైవసీ భయాలను కారణంగా చూపిన వారు 40% మంది. వినియోగదారుల సమాచారాన్ని కం పెనీ ఇతర అవసరాల కోసం వాడుకుంటుందని 35% మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇందుకు తగ్గ ట్టుగానే ఇంట్లో స్మార్ట్ హోం పరికరాలు ఉన్న వారిలో 22% మంది రక్షణ కోసం తామేమీ అదనపు చర్యలు తీసుకోవడం లేదని, పరికరంలో ముందుగానే ఏర్పాటైన సెక్యూరిటీతోనే సరిపుచ్చుకుంటున్నామని చెప్పడం గమనార్హం. పాస్‌వర్డ్‌లుగా వ్యక్తిగత సమాచారం పాస్వర్డులుగా వ్యక్తిగత సమాచారం వాడేవారు 82% ఉండగా.. ఇందులోనూ పుట్టిన రోజులను లేదా భార్య, పిల్లల పేర్లను వాడేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. 69 శాతం మంది ఏదో ఒక పేరును వాడుతున్నట్లు చెబితే పుట్టిన రోజును వాడేవాళ్లు 58 శాతం మంది ఉన్నట్లు నార్టన్ లైఫ్‌లాక్ సర్వే తెలిపింది. వైఫై రౌటర్లు ఉన్న భారతీయుల్లో 72 శాతం మంది తాము రౌటర్ పాస్‌వర్డ్‌ను ఏడాదికి ఒకసారి మారుస్తున్నట్లు చెబితే నెలకోసారి మారుస్తామని కేవలం 26 శాతం మంది మాత్రమే తెలిపారు. తాము ఇప్పటివరకూ పాస్వర్డ్ మార్చనేలేదని అంగీకరించిన వారు తొమ్మిది శాతం మంది! పిల్లలకు చెప్పాలి సైబర్ భద్రత గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసు నుంచే నేర్పించాలని సర్వే చేసిన వాళ్లలో 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ ఆన్లైన్ వ్యవహారాల్లో పిల్లలను కాపాడుకోవడం కష్టమేనని 75 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ‘కోవిడ్ సమయంలో ఆన్లైన్ వ్యవహారాల్లో పెరుగుదల అనివార్యమైంది. కానీ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ సమయాల మధ్య సమతౌల్యం పాటించడం కూడా ముఖ్యం. లేదంటే ఆరోగ్యం మరీ ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది’ అని నార్టన్ లైఫ్‌లాక్ డైరెక్టర్ రితేశ్ చోప్రా తెలిపారు. -
యస్.. మేం ఆన్లైన్ బానిసలం
న్యూఢిల్టీ: కరోనా మహమ్మారి..నిత్య జీవనంలో డిజిటల్‌ను భాగం చేయడమే కాకుండా.. మరింత మంది ఆన్‌లైన్‌కు బానిసలుగా మారేలా కారణమవుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్లైఫ్ లాక్ ఓ నివేదికలో తెలిపింది. కరోనా కారణంగా ఎక్కువ సమయం ఇంటివద్దే ఉండాల్సి రావడంతో ప్రజల ఆన్లైన్ ధోరణిపై ఈ సంస్థ అంతర్జాతీయంగా అధ్యయనం నిర్వహించింది. భారత్‌కు సంబంధించి ఫలితాలను గమనిస్తే.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు (సర్వేలో పాల్గొన్న వారిలో) కరోనా వల్లే తాము ఆన్‌లైన్‌కు బానిసలుగా మారినట్టు చెప్పారు. ఆసక్తికర అంశాలు.. • విద్యా, కార్యాలయ పని కాకుండా ఫోన్లు, సిస్టమ్స్‌పై (ఆన్లైన్) తాము వెచ్చించే అదనపు సమయం గణనీయంగా పెరిగినట్టు ప్రతీ 10 మందిలో 8 మంది పేర్కొన్నారు. • చదువు, ఆఫీసు పని కాకుండా సగటున ఒక్కొకరు 4.4 గంటలను ఆన్‌లైన్‌పై గడిపేస్తున్నట్టు ఈ సంస్థ నివేదిక తెలియజేసింది. • తాము మరింత సమయం స్మార్ట్ఫోన్పైనే గడిపేస్తున్నామని 84 శాతం మంది తెలిపారు. • ఇలా అన్లైన్పై ఎక్కువ సమయం గడపడం తమ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నట్టు 74 శాతం మంది అంగీకరించారు. • మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోందని 55 శాతం మంది పేర్కొన్నారు. • స్నేహితులతో సమయం గడపడం ద్వారా ఫోన్లు, సిస్టమ్స్‌పై గడిపే సమయాన్ని పరిమితం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని 76 శాతం మంది చెప్పారు. సమతూకం అవసరం ఆఫ్‌లైన్‌లో చేసుకోవాల్సిన పనులను కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి పరిస్థితులు కల్పించాయన్నది సుస్పష్టం. అయితే స్క్రీన్లపై గడిపే సమయం, ఇతర పనులకు వెచ్చించే సమయం మధ్య ఆరోగ్యకరమైన సమతూకం అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించడం ముఖ్యం. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినకూడదు’’ – రితేష్చోప్రా, నార్టన్‌లైఫ్‌లాక్ డైరెక్టర్ (సేల్స్) చదవండి : మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు -
మిలీనియల్సే టాప్
ఆన్లైన్ మోసాల గురించి మనం తరచూ వింటుంటాం. అయినా సరే.. షాపింగ్ యాప్ లేదా వెబ్సైట్ తెరిచి కొనుగోళ్లు మాత్రం ఆపం. బిల్లులు కట్టేందుకూ, బ్యాంకు లావాదేవీలు నడిపేందుకు అస్సలు వెనుకాడం. ఇంటిపట్టున ఉంటూ పనులన్నీ చక్కబెట్టే వెసులుబాటు, సౌకర్యం ఉండటం, సమయం ఆదా అవుతోందన్నది దీనికి కారణం. ఇలాంటి లాభాలన్నీ ఉన్నాయని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. మీకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు చేరనూ వచ్చు. ఇంతకీ దేశంలో పురుషులు, మహిళలు, ఈతరం, వెనుకటి తరం ఆ ముందు తరాల ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్ వ్యవహారాల తీరుతెన్నులెలా ఉన్నాయి? ఇంటర్నెట్ భద్రత సంస్థ ఈ విషయాన్ని కనుక్కునేందుకు డిజిటల్ వెల్నెస్ సర్వే ఒకటి నిర్వహించింది. ‘ఆన్లైన్’ మిలీనియల్స్ (25– 34 మధ్య వయస్కులు) టాప్‌లో ఉన్నారు. 83 శాతం ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఆర్థిక మోసాలు, సమాచార చోరీ అన్నవి రెండు పెద్ద ప్రమాదాలని తెలిసిన వారు ఇవీ జాగ్రత్తలు... - వేర్వేరు వెబ్సైట్లకు వేర్వేరు పాస్వర్డ్లు వాడటం మేలు. అంకెలు, గుర్తులు, అక్షరాలు కలిసి పాస్వర్డ్ ఉండాలి. - సైబర్ నేరగాళ్లు ఎక్కువగా దృష్టి పెట్టేది సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలపైనే. కాబట్టి సాఫ్ట్వేర్ లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. - షాపింగ్ వెబ్సైట్ ‘హెచ్‌టీటీపీఎస్’తో మొదలవుతోందా? లేదా చూసుకోండి. బ్రౌజర్ బార్లో ఒకవైపు తాళం కప్ప వేసిన గుర్తు అది కూడా పచ్చ రంగులో ఉంటే ఆయా వెబ్సైట్ల సమాచారం ఎన్క్రిప్షన్ (రహస్య సంకేతాలతో కూడిన భాష)ను ఉపయోగిస్తుందని అర్థం. ఇలాంటి వెబ్సైట్లలోకి చొరబడటం హ్యాకర్లకు కష్టం. - గుర్తుతెలియని వ్యక్తులు/కంపెనీల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకపోవడం మంచిది. ఇలాంటివి మిమ్మల్ని ఏదో ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాలు రాబట్టుకునే చాన్స్ ఉంది. - ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వెబ్సైట్ యూఆర్ఎల్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఫేక్ వెబ్సైట్లను సృష్టిస్తుం టారు హ్యాకర్లు. ఇంటర్నెట్ సెక్యూరిటీ కోసం పూర్తిస్థాయి సూట్‌ను వాడటం మేలు. ఇందుకు వెచ్చించే మొత్తం మీకు మాల్వేర్, ర్యాన్సమ్వేర్, వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. సర్వే నిర్వహణ ఇలా... దేశం మొత్తమ్మీద సుమారు 1,572 మందిని నార్టన్ లైఫ్‌లాక్ సంస్థ సర్వే చేసింది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ను ఉపయోగించే వారు, 18 ఏళ్లకంటే ఎక్కువ వయసున్న వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 8 – 16 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో విద్యార్హతలు, ఆదాయం అంశాల ఆధారంగా విభజించిన ఇళ్లలోని వ్యక్తులను ప్రశ్నించారు. -
ఫ్రీ-వైఫైతో ముగ్గురిలో ఒకరు..
న్యూఢిల్లీ: భారత్‌లో ఫ్రీ వైఫైతో కనీసం ముగ్గురిలో ఒకరు అడల్ట్ చిత్రాలనే చూస్తున్నారని నార్టన్ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో హోటల్స్, ఎయిర్‌పోర్టు, లైబ్రరీ, వర్కింగ్ ప్లేస్‌లో ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫ్రీ-వైఫైని మంచి కన్నా చెడుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిసింది. భారత్‌లో సగటున ముగ్గురిలో ఒకరైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురిలో ఒకరు ఫ్రీ-వైఫైని దుర్వినియోగం చెస్తున్నారని నార్టన్ సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ-వైఫై అడ్మిన్లపై నిర్వహించిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిపింది. భారత్‌లో ఫ్రీ-వైఫై ఉపయోగించే వెయ్యి మంది అడ్మిన్లపై స్టడీ చేయగా ఈ విస్తుపోయే విషయం వెల్లడైందని తెలిపింది. భారత్‌లోని వీధుల్లో ఫ్రీ వైఫై ఉపయోగించే వారిలో 31 శాతం అశ్లీల చిత్రాలు చూస్తున్నారని, బుస్సు, రైల్వే స్టేషన్లలో 34 శాతం , లైబ్రరీల్లో 24 శాతం , ఎయిర్‌పోర్టుల్లో 34 శాతం మంది చూస్తున్నారని తమ సర్వేలో వెల్లడైందని నార్టన్ పేర్కొంది. సైబర్ సెక్యూర్ లేని ఫ్రీ వైఫైలతో సోషల్ మీడియాను, వ్యక్తిగత కార్యకలపాలను నిర్వహిస్తున్నారని తెలిపింది.