కెనాడా: కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం కచ్చితంగా చేయాలి. ఈ క్రమంలోనే సామాజిక దూరం పాటించడానికి అంతగా వీలుండని జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లను తెరవడానికి ప్రభుత్వాలు ఇంకా అనుమతినివ్వలేదు. అయితే కెనడానలోని ఒక హోటల్‌లో మాత్రం యోగా క్లాసులను చాలా విచిత్రంగా నిర్వహించారు. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఒకరిని మరొకరు తాకకుండా చాలా జాగ్రత్తగా యోగా చేశారు. మొదట హోటల్‌లోకి వచ్చే ముందే అందరికి టెంపరేచర్ అని పరీక్షించి లోపలికి అనుమతించారు. తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డోమ్‌ల లోపల యోగాసనాలను వేశారు. ఈ ఆలోచనను చూసి అందరూ శభాష్ అంటున్నారు. (కరోనా అంటిస్తున్నాడని ఇటుకతో..)
ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ మేఘన్ వెదర్ స్టన్ ఆధ్వర్యంలో కెనడాలోని హోటల్ ఎక్స్‌లో జూన్23న అవుల్‌డోర్ ఫిట్‌నెస్ తరగతులను నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిన క్రమంలో బబూల్ పాడ్స్‌లో యోగా తరగతులను నిర్వహించారు. కెనడా లాక్‌డౌన్‌ను ఎత్తివేసి తిరిగి ఆర్థివ్యవస్థను పెట్టే గాడిలో పెట్టేపనిలో పడింది. ఈ మేరకు అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. (మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్)
Comments
Please login to add a commentAdd a comment