యూరోప్లో బ్రిటన్దే హవా.. | Oxford is the world's best university | Sakshi
Sakshi News home page

యూరోప్లో బ్రిటన్దే హవా..

Published Fri, Sep 30 2016 11:51 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

యూరోప్లో బ్రిటన్దే హవా..

యూరోప్లో బ్రిటన్దే హవా..

లండన్: యూరోప్లో బ్రిటన్ హవా కొనసాగుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి బ్రిటన్ పైనే ఉంది. ఈ పరిణామంతో లాభపడ్డది ఎవరు నష్టపోయింది ఎవరు అంటూ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే దేశాభివృద్ధిలో ఉన్నత విద్య పాత్ర కీలకమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన  టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ తొలి స్థానం కైవసం చేసుకుంది. టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల్లో బ్రిటన్కు చెందిన యూనివర్సిటీకీ మొదటి స్థానం రావడం ఇదే ప్రథమం. ప్రపంచ వ్యాప్తంగా 980 టాప్ యూనివర్సిటీల జాబితాను ఎంపిక చేయగా, 148 యూనివర్సిటీలతో అమెరికా తొలి స్థానంలో నిలిస్తే, 91 యూనివర్సిటీలతో యూకే రెండో స్థానంలో నిలిచింది.

టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన టాప్ 10 యూరోపియన్ యూనివర్సిటీలు( బ్రాకెట్లో ప్రపంచ ర్యాంకు):

1) యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, యూకే(  1)
2) యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూకే( 4 )
3) ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూకే( 8 )
4) ఈటీహెచ్ జ్యూరిచ్, స్విడ్జర్ల్యాండ్(  9)
5) యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూకే(  15)
6) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, యూకే( 25 )
7) యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూకే( 27 )
8) కరోలిన్స్కా ఇన్స్స్టిట్యూట్, స్వీడన్( 28 )
9) ఈకోలే పాలిటెక్నిక్ ఫెడరల్ డె లసాన్నె, స్విడ్జర్ల్యాండ్( 30 )
10) ఎల్ఎంయూ మ్యూనిచ్, జర్మనీ( 30 )


యూరోప్లోని యూనివర్సిటీల్లో ఆక్స్ఫర్డ్ మొదటి స్థానం కైవసం చేసుకోగా, తర్వాతి స్థానంలో కేంబ్రిడ్జ్ నిలిచింది. వీటితో పాటూ బ్రిటన్కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆ తరువాతి స్థానంలో నిలిచి యూరోప్లో తొలి మూడు స్థానాలను బ్రిటన్ కైవసం చేసుకుంది. అంతే కాకుండా యూరోప్లో టాప్ 10 జాబితాలో ఏకంగా బ్రిటన్కు చెందిన ఆరు యూనివర్సిటీలకు చోటు దక్కింది. స్విడ్జర్ల్యాండ్కు చెందిన రెండు, స్వీడన్, జర్మనీకి చెందిన ఒక్కో యూనివర్సిటీలకు యూరోప్ టాప్ 10 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కింది.

యూరోప్ టాప్ 10 యూనివర్సిటీల జాబితాలో బ్రిటన్ ఆధిపత్యం అప్రతిహాతంగా కొనసాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బ్రిటన్ లేని యూరోప్ టాప్ 10 జాబితాను పరిశీలిస్తే..

1) ఈటీహెచ్ జ్యూరిచ్, స్విడ్జర్ల్యాండ్(  9)
2) కరోలిన్స్కా ఇన్స్స్టిట్యూట్, స్వీడన్(  28)
3)ఈకోలే పాలిటెక్నిక్ ఫెడరల్ డె లసాన్నె, స్విడ్జర్ల్యాండ్( 30 )
4)ఎల్ఎంయూ మ్యూనిచ్, జర్మనీ( 30 )
5)కేయూ ల్యూవెన్, బెల్జియం( 40 )
6)హిడెల్ బర్గ్ యూనివర్సిటీ, జర్మనీ(  43)
7)టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్, జర్మనీ(  46)
8)హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, జర్మనీ( 57 )
9)డెఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, నెదర్లాండ్(  59)
10) యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్స్టర్డ్యాంమ్, నెదర్లాండ్( 63 )


బ్రిటన్ను పక్కన పెడితే ప్రపంచ టాప్ యూనివర్సిటీల జాబితాలో యూరోప్ టాప్ 10 జాబితాలో చిట్ట చివరన నిలిచిన యూనివర్సిటీ ర్యాంకు 63కు పడిపోయింది. ఈ మార్పుతో జర్మనీకి చెందిన మూడు యూనివర్సిటీలు, బెల్జియంకు చెందిన ఒక్కటి, డచ్కు చెందిన రెండు యూనివర్సిటీలు టాప్ 10 జాబితాలో చోటు సంపాదించాయి. పరిశోధనల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జర్మనీ యూనివర్సీటీలు ముందంజలో నిలిచాయి.

అయితే మిగతా యూరోపియన్ యూనివర్సిటీలు మాత్రం తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్లతో పాటూ మధ్య, తూర్పు యూరోప్లోని దేశాలను వెనక్కు నెట్టి ఆసియాకు చెందిన యూనివర్సిటీలు ముందుకు దూసుకొస్తున్నాయని టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ వెల్లడించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement