బెస్ట్ యూనివర్సిటీల్లో ఇండియా సూపర్
బెస్ట్ యూనివర్సిటీల్లో ఇండియా సూపర్
Published Thu, Mar 16 2017 9:08 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
ఆసియాలో ఇండియన్ యూనివర్సిటీలు దుమ్మురేపుతున్నాయి. ఆసియాలో బెస్ట్ యూనివర్సిటీల జాబితాల్లో భారత యూనివర్సిటీలు గతేడాది కంటే రెట్టింపయ్యాయి. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసిన ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017 జాబితాలో భారత్ నుంచి 33 యూనివర్సిటీలు టాప్-300లో నిలిచాయి. వీటిలో 17 యూనివర్సిటీలు కొత్తగా చోటు దక్కించుకోగా, మరో 16 చివరి ఏడాది నుంచి టాప్-300లో కొనసాగుతున్నాయి. టాప్-100లో ఎనిమిది భారత్ వే ఉన్నాయని టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ తెలిపింది.
ఈ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 27 స్థానంలో ఉండగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి 42, వెల్టెక్ యూనివర్సిటీ 43 స్థానంతో టాప్-50లో ఉన్నాయి. రెండో ఏడాది కూడా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ, చైనా పెకింగ్ యూనివర్సిటీలే మొదటి, రెండో స్థానాలను సొంతం చేసుకున్నాయి. 69 యూనివర్సిటీలతో ర్యాంకింగ్స్ లో ఎక్కువ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కేవలం రెండు జపనీస్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే టాప్-20లో ఉన్నాయి.
తర్వాత చైనా టాప్-20లో ఆరు యూనివర్సిటీలను కలిగి ఉంది. ఆసియాలో బెస్ట్ యూనివర్సిటీల జాబితాలో భారత్ రెండింతలు రెట్టింపు చేసుకోవడం గుడ్ న్యూస్ అని టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎడిటర్ తెలిపారు. దీంతో ర్యాంకింగ్స్ లో భారత్ మూడో అతిపెద్ద దేశంగా నిలిచిందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement