
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమత్–ఉద్–దవాహ్ చీఫ్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని మరో 30 రోజులపాటు పాకిస్తాన్ పంజాబ్ జ్యుడీషియల్ రివ్వూ్య బోర్డు పొడిగించింది. హఫీజ్ సహచరుల గృహ నిర్బంధ గడువును పెంచాలన్న పాక్ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. హఫీజ్, అతని నలుగురు అనుచరులను భారీ బందోబస్తు మధ్య గురువారం లాహోర్ హైకోర్టులోని జ్యుడీషియల్ బోర్డు ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న జస్టిస్ యావర్ అలీ, జస్టిస్ అబ్దుల్ సమీ, జస్టిస్ ఆలియా నీలమ్‌లతో కూడిన జ్యుడీషియల్ బోర్డు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోని హఫీజ్ గృహ నిర్బంధ గడువును మరో 3 నెలల పెంచాలని పంజాబ్ ప్రభుత్వ హోం శాఖ కోరింది. వీరి అభ్యర్థనను తిరస్కరిస్తూ 30 రోజులు మాత్రమే గడువు పెంచుతూ తీర్పునిచ్చింది. అలాగే సెప్టెంబర్ 25తో ముగిసిన హఫీజ్ అనుచరులు అబ్దుల్లా ఉబీద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రహమాన్ అబిద్, ఖాజీ కషీఫ్ హుస్సెన్ గృహ నిర్బంధ గడువు పెంచాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. అక్టోబర్ 24 నుంచి మరో 30 రోజులపాటు గృహ నిర్బంధం అమల్లో ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment