లాహోర్ : హఫీజ్ సయీద్ విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా సహకారం అందిస్తోంది. ఇందుకు లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2008 ముంబై దాడులకు మాస్టర్‌మైండ్ అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్‌లో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి హఫీజ్ సయీద్ పాత్రపై సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోతే గృహనిర్భంధం నుంచి ఆయన్ను విడుదల చేయాల్సి వస్తుందని లాహోర్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. ముంబై దాడులకు సంబంధించి హఫీజ్ సయీద్ ఈ ఏడాది జనవరి 31 నుంచి గృహనిర్భంధాన్ని పాక్ ప్రభుత్వం విధించింది. అయితే ప్రభుత్వ నిర్భంధంపై హఫీజ్ సయీద్ లాహోర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై పాకిస్తాన్ అంతర్గత భద్రతా కార్యదర్శి స్పందిస్తూ.. ఇందుకు సంబంధించిన ఆధారాలను గతంలో కోర్టును సమర్పించినట్లు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. దేశంలో ఏ పౌరుడు కేవలం కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తలతో గృహనిర్భంధాన్ని విధించడం సరికాదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment