hafiz saeed house arrest
-
సయీద్ గృహ నిర్బంధం పొడిగింపు
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమత్–ఉద్–దవాహ్ చీఫ్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని మరో 30 రోజులపాటు పాకిస్తాన్ పంజాబ్ జ్యుడీషియల్ రివ్వూ్య బోర్డు పొడిగించింది. హఫీజ్ సహచరుల గృహ నిర్బంధ గడువును పెంచాలన్న పాక్ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. హఫీజ్, అతని నలుగురు అనుచరులను భారీ బందోబస్తు మధ్య గురువారం లాహోర్ హైకోర్టులోని జ్యుడీషియల్ బోర్డు ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న జస్టిస్ యావర్ అలీ, జస్టిస్ అబ్దుల్ సమీ, జస్టిస్ ఆలియా నీలమ్‌లతో కూడిన జ్యుడీషియల్ బోర్డు ఈ మేరకు తీర్పునిచ్చింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోని హఫీజ్ గృహ నిర్బంధ గడువును మరో 3 నెలల పెంచాలని పంజాబ్ ప్రభుత్వ హోం శాఖ కోరింది. వీరి అభ్యర్థనను తిరస్కరిస్తూ 30 రోజులు మాత్రమే గడువు పెంచుతూ తీర్పునిచ్చింది. అలాగే సెప్టెంబర్ 25తో ముగిసిన హఫీజ్ అనుచరులు అబ్దుల్లా ఉబీద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రహమాన్ అబిద్, ఖాజీ కషీఫ్ హుస్సెన్ గృహ నిర్బంధ గడువు పెంచాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. అక్టోబర్ 24 నుంచి మరో 30 రోజులపాటు గృహ నిర్బంధం అమల్లో ఉంటుందని పేర్కొంది. -
గృహనిర్భంధం నుంచి హఫీజ్‌కు విముక్తి?
-
గృహనిర్బంధం నుంచి హఫీజ్‌కు విముక్తి?
లాహోర్ : హఫీజ్ సయీద్ విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా సహకారం అందిస్తోంది. ఇందుకు లాహోర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2008 ముంబై దాడులకు మాస్టర్‌మైండ్ అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి హఫీజ్ సయీద్ పాత్రపై సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోతే గృహనిర్భంధం నుంచి ఆయన్ను విడుదల చేయాల్సి వస్తుందని లాహోర్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. ముంబై దాడులకు సంబంధించి హఫీజ్ సయీద్ ఈ ఏడాది జనవరి 31 నుంచి గృహనిర్భంధాన్ని పాక్ ప్రభుత్వం విధించింది. అయితే ప్రభుత్వ నిర్భంధంపై హఫీజ్ సయీద్ లాహోర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై పాకిస్తాన్ అంతర్గత భద్రతా కార్యదర్శి స్పందిస్తూ.. ఇందుకు సంబంధించిన ఆధారాలను గతంలో కోర్టును సమర్పించినట్లు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. దేశంలో ఏ పౌరుడు కేవలం కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తలతో గృహనిర్భంధాన్ని విధించడం సరికాదని పేర్కొంది. -
ఎవరి ఒత్తిడిపై సయీద్ గృహ నిర్బంధం?
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్లకు సూత్రధారి లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీద్ సయీద్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం గృహ నిర్బంధం విధించడాన్ని అది భారత ప్రభుత్వ విజయంగా కొంత మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబై పేలుళ్ల కేసులో సయీద్ పట్టి అప్పగించాల్సిందిగా ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వం, దాదాపు మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చిన, ఎన్ని హెచ్చరికలు చేసినా స్పందించని పాక్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు స్పందిస్తుంది? సయీద్‌కు గృహ నిర్బంధం విధించినట్లు పాక్ ప్రభుత్వం కాకుండా పాక్ సైనిక అధికార ప్రతినిధి ప్రకటించడంలో కూడా మతలబు ఉండే ఉంటుంది. ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిషేధించిన నేపథ్యంలోనే సయీద్‌ను గృహ నిర్బంధంలోకి తీసుకోవడం గమనార్హం. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అంచనా వేయలేని ట్రంప్ తనపై నిషేధం విధించకుండా ముందుజాగ్రత్త వహించడంలో భాగంగానే పాక్ ప్రభుత్వం ఈ చర్య తీసుకొని ఉంటుంది. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలిస్తామని ట్రంప్ శపథం చేయడం కూడా ఇక్కడ గమనార్హం. భారత్ లాంటి దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జమాత్ ఉద్ దవా సంస్థ దేశీయంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించేందుకు కూడా సయీద్‌ను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారని పాక్ సైనిక వర్గాలే చెబుతున్నాయి. సయీద్‌ను అరెస్ట్ చేసి భారత్‌కు అప్పగించినప్పుడు మాత్రమే భారత్ ఒత్తిడికి లొంగిందనిగానీ, పాక్ వైఖరిలో మార్పు వచ్చిందనిగానీ భావించవచ్చు. తాము తమ వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు ఓ సంకేతం పంపించేందుకే సయీద్‌పై ఈ చర్య తీసుకొని ఉండవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.