చట్టం ముందు అందరూ సమానమేనని మరోసారి రుజువయ్యింది. తప్పు చేస్తే ఎవరూ తప్పించుకోలేరు. శిక్ష అనుభవించాల్సిందే. ఈ విషయంలో స్టార్ హీరోలకు కూడా మినహాయింపు లేదు. ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పరిస్థితి చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. కృష్ణజింకను వేటాడిన కేసు విషయంలో సల్మాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తారలు జైలుకెళ్లడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ సంజయ్ దత్, అక్షయ్ కుమార్, మోనికా బేడీ వంటి వారు పలు ఆరోపణలు ఎదుర్కొని, నేరస్తులుగా జైలుకు వెళ్లారు. ఓ సారి ఆ ప్రముఖులేవరో చూడండి...
సల్మాన్ ఖాన్ : కృష్ణజింకను వేటాడినట్లు 1998లో ఈ హీరో మీద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్థారిస్తూ ఐదేళ్ల శిక్ష విధించింది జోధ్‌పూర్ కోర్టు.
సంజయ్ దత్ : సంజయ్ దత్ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఖల్‌నాయక్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబయి బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉండటంతో కోర్టు అతన్ని దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. 1992 ముంబయి పేలుళ్లలో సుమారు 230మంది మరణించారు.
జాన్ అబ్రహామ్ : నిర్లక్ష్యంగా బైక్ డ్రైవ్ చేసి, ఇద్దరు మనుషులను గాయాలపాలు చేయడంతో 15 రోజుల శిక్ష అనుభవించాడు ఈ బైక్ ప్రేమికుడు.
అక్షయ్ కుమార్ : అప్పట్లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఈ కిలాడీ హీరో చేసిన పిచ్చి పనిని ఎవరూ మర్చిపోలేరు. ఈ షోలో అక్షయ్ వేదిక మీదే బట్టలు విప్పేందుకు ప్రయత్నించాడు. ఈ పిచ్చి పని వల్ల అక్షయ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. కానీ వెంటనే బెయిల్ పై విడుదలయ్యాడు.
సైఫ్ అలీ ఖాన్ : ఈ ఛోటా నవాబ్ కూడా జైలు మెట్లేక్కిన వాడే. ఒకప్పటి తన ప్రియురాలు, ప్రస్తుతం భార్య అయిన కరీనా కపూర్, మలైకా అరోరాలతో కలిసి ముంబాయిలోని తాజ్ హోటల్‌కు వెళ్లాడు. ఆ సమయంతో పక్క టేబుల్‌లో ఉన్న వ్యక్తి వీరిని కాస్తా నిశ్శబ్దంగా ఉండమని కోరాడు. ఆగ్రహించిన సైఫ్ ఆ వ్యక్తితో గొడవపడ్డాడు. వివారం ముదిరి కొద్ది గంటల్లోనే జైలుకు వెళ్లాడు. 2-3 రోజుల అనంతరం ఈ వివాదం సద్దుమణిగింది.
షైనీ అహుజా : అప్పుడప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న యువ హీరో ఒళ్లు మరిచి చేసిన తప్పుతో తన సినీ పరిశ్రమలో తన భవిష్యత్తును కోల్పోవడమే కాకుండా ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇంతకు ఈ హీరోగారు చేసిన నేరం ఏమిటంటే తన దగ్గర పనిచేసే అమ్మాయిపై అత్యాచారం చేశాడు. కోర్టు అతనికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మూడున్నర నెలల పాటు జైలులో ఉన్న ఈ హీరో అనంతరం బెయిల్ మీద బయటకి వచ్చాడు.
ఫర్దీన్ ఖాన్ : ఓ వ్యక్తి వద్ద నుంచి మాదకద్రవ్యాలు కొంటూ పోలీసులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు ఈ నటుడు. ఐదురోజుల అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చాడు.
సునీల్ శెట్టీ : చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారి సునీల్ శెట్టీ మీద చెక్కు బౌన్స్ కేసు పెట్టాడు. హుందాయ్ టెలికం డైరెక్టర్ హోదాలో సునీల్ శెట్టీ ఈ చెక్‌ను జారీ చేశాడు.
మధుర్ భండర్కార్ : మోడలింగ్, సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరొందిన మధుర్. స్వయంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ దర్శకుడు తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసాడని ప్రీతి జైన్ అనే నటి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
మోనికా బేడీ : పాస్‌పోర్టు ఫోర్జరీ చేసిందనే నేరంలో ఈ ‘తాజ్‌మహల్’ హీరోయిన్ జైలుపాలయ్యింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ డాన్‌గా గుర్తింపు పొందిన అబు సలేంతో కలిసి ఈమె ఈ నేరానికి పాల్పడింది. ఈ నేరానికి గాను ఐదేళ్లు జైలులో గడిపింది.
సోనాలి బింద్రే : కృష్ణజింకను వేటాడిన కేసులో ఊరట పొందిన ఈ బాలీవుడ్ హీరోయిన్ గతంలో ఓ మ్యాగ్‌జైన్ కవర్ ఫోటో వివాదంలో జైలుకు వెళ్లింది. మ్యాగ్‌జైన్ కోసం ఈ హీరోయిన్ ఇచ్చిన ఫోజులు ప్రజల మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జైలుకెళ్లి ఆమె అనంతరం బెయిల్ మీద విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment