ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ టెర్రరిస్టు అని, భారత ప్రజలు ఓ ఉగ్రవాదిని తమ దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓ ఉగ్రవాద సంస్థ అని, అది రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్)కు అనుబంధ సంస్థగా పనిచేస్తోందని స్థానిక వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.
గుజరాత్ అల్లర్లలో మోదీ ముస్లింల రక్తం కళ్ల చూశారని విమర్శించారు. భారత్‌లో గోవధ పేరుతో ముస్లింలు, దళితులను హతమారుస్తున్నారని ఆరోపించారు. వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలను ఉగ్రవాదులతో పోల్చి వారి దిష్టిబొమ్మలను తగలబెట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఆసిఫ్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఖండించారు. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచానికి చెబుతున్నారనే కారణంతో మోదీపై తమ అక్కసు వెల్లగక్కుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment