పాకిస్థాన్ లో భారీ కుంభకోణం | Pakistan railways hit by Rs 16 billion signalling system scam: report | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ లో భారీ కుంభకోణం

Published Mon, Sep 19 2016 8:09 PM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM

Pakistan railways hit by Rs 16 billion signalling system scam: report

లాహోర్‌: పాకిస్థాన్‌ రైల్వేలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. దశాబ్దాలుగా ఉన్న సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించిన పనుల్లో రూ.1,028 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు అంతర్గత ఆడిట్‌లో బయటపడింది. సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునీకరణకు 2008-09 మధ్యకాలంలో బొంబార్డియర్‌ కార్పొరేషన్, చైనా రైల్వేస్‌ సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కార్పొరేషన్‌(బీటీ–సీఆర్సీఎస్‌) కన్సార్టియానికి పాకిస్థాన్ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులను అప్పగించింది.

2014 వరకు ఈ ప్రాజెక్టుల వ్యయం రూ.1,028 కోట్లకు చేరింది. అనంతరం మరో రూ.449.84 కోట్లు కేటాయించారు. అయినా ఇవి ఓ కొలిక్కి రాలేదని ఆడిట్‌ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో రూ.1,028 కోట్ల మేర కుంభకోణం జరిగిందని వెల్లడించారు. నేషనల్ ఎకౌంట్ బులిటీ బ్యూరో(ఎన్ఏబీ)కు ఈ నివేదికను సమర్పించారు. కాంట్రాక్టర్, అధికారులు కలిసి ఈ కుంభకోణం చేశారని నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement