చిక్కిందా.. లక్కుందా..  | Pedro Jarque Photo Selected For 2019 Bird Photographer Of The Year | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 4 2019 3:40 AM | Last Updated on Mon, Feb 4 2019 3:40 AM

Pedro Jarque Photo Selected For 2019 Bird Photographer Of The Year - Sakshi

నాది.. నాది.. కాదు నాది అంటూ పోటీపడుతున్న పెలికాన్స్‌ను చూశారుగా.. ఉన్నదేమో ఒకటే చేప.. పెలికాన్స్‌ ఏమో మూడు.. దాన్ని అమాంతం మింగేయడానికి నోరు తెరిచి మరీ అక్కడవి వెయిటింగ్‌.. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది?  ఈ మూడింటిలో ఏది లక్కీ.. ఏదిఅన్‌లక్కీ.. ఇంతకీ చేప వాటికి చిక్కిందా.. లేదా చేపకే లక్కుండి.. క్షేమంగా తప్పించుకుందా? ఈ చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్‌ పెడ్రోజార్క్‌(పెరూ)నే అడుగుదామంటే.. ఆయన తెగ బిజీగా ఉన్నారు. ఎందుకంటే.. పెడ్రో తీసిన ఈ చిత్రం 2019 బర్డ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ తుదిజాబితాకు ఎంపికైంది. ఆయన కూడా అవార్డు వస్తుందా రాదా అన్న టెన్షన్‌లో ఉన్నారు. ఈపోటీకి  63 దేశాల నుంచి వేలాది ఎంట్రీలు రాగా.. తుది జాబితాకు ఎంపికైన వాటిలో ఈ ఫొటో కూడా ఉంది. ఈ అవార్డును ఏటా బ్రిటన్‌కు చెందిన నేచర్స్‌ ఫోటోగ్రాఫర్స్‌ లిమిటెడ్‌ ప్రదానం చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement