కారకస్: దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజులాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విపక్ష నేత జువాన్ గుయాడో ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండగా, అధ్యక్షుడు నికోలస్ మదురోకు సైన్యం తోడ్పాటు లభించింది. అమెరికాతోపాటు అనేక వెనెజులా పొరుగుదేశాలు గుయాడోకు మద్దతు తెలిపి ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించగా, రష్యా, చైనా సహా పలు దేశాలు మదురోకు మద్దతుగా నిలిచాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతోపాటు ప్రజలకు నిత్యావసరాలు కూడా సరిగ్గా దొరకక తిండి కోసం నానా తిప్పలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment