చెత్త ప్రెసిడెంట్‌ ట్రంప్‌ | Poll finds Trump's standing weakened since springtime | Sakshi
Sakshi News home page

చెత్త ప్రెసిడెంట్‌ ట్రంప్‌

Published Tue, Jul 18 2017 1:25 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

చెత్త ప్రెసిడెంట్‌ ట్రంప్‌ - Sakshi

చెత్త ప్రెసిడెంట్‌ ట్రంప్‌

‘వాషింగ్టన్‌ పోస్ట్‌–ఏబీసీ’ సర్వేలో 36 శాతమే మద్దతు
వాషింగ్టన్‌: మొదటి 6 నెలల పాలనలో అతి తక్కువ ప్రజాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రికార్డు సృష్టించారు. ‘వాషింగ్టన్‌ పోస్ట్‌–ఏబీసీ న్యూస్‌’ నిర్వహించిన ఈ సర్వేలో ట్రంప్‌కు కేవలం 36 శాతం అమెరికన్లే మద్దతు తెలిపారు. గత 70 ఏళ్లలో ఇదే అతి తక్కువని ఏబీసీ న్యూస్‌ పేర్కొంది. ట్రంప్‌ 100 రోజుల పాలనపై ‘వాషింగ్టన్‌ పోస్ట్‌–ఏబీసీ న్యూస్‌’  నిర్వహించిన సర్వేలో 42 శాతం ప్రజాదరణ దక్కగా 80 రోజుల వ్యవధిలో అది 6 శాతం తగ్గడం గమనార్హం.

దాదాపు 48 శాతం అమెరికన్లు ట్రంప్‌ నిర్ణయాల్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ పోల్‌ను ట్విటర్‌లో ట్రంప్‌ తప్పుబడుతూ.. ‘ఇది కూడా ఎన్నికల సమయంలో నిర్వహించిన తప్పుడు సర్వేలాంటిదే’ అని పేర్కొన్నారు. ట్రంప్‌ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్, అల్లుడు కుష్నర్, ఎన్నికల ప్రచార శిబిరం మేనేజర్‌ పాల్‌లు రష్యా లాయర్‌తో సమావేశమవడాన్ని 66 శాతం వ్యతిరేకించగా కేవలం 26 శాతమే సమర్థించారు.

ఇక 2016 అధ్యక్ష ఎన్నికల్ని రష్యా ప్రభావితం చేసిందని 60 శాతం చెప్పగా.. ట్రంప్‌ సహాయకులు అలాంటి ప్రయత్నం చేసి ఉండవచ్చని 41 శాతం పేర్కొన్నారు. రష్యా సాయంతో ట్రంప్‌ లాభపడ్డారని 44 శాతం, అధ్యక్ష ఎన్నికల్ని రష్యా ప్రభావితం చేయలేదని 31 శాతం అమెరికన్లు చెప్పారు. పన్నులు తగ్గించడం కంటే అందరికీ ఆరోగ్య బీమా ముఖ్యమని 63 శాతం  మంది స్పష్టం చేశారు. ఒబామా కేర్‌కు 50 శాతంపైగా మద్దతు ప్రకటించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయంగా అమెరికా ప్రభావం తగ్గుతుందని 48 శాతం మంది పేర్కొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement