సురక్షిత ప్రపంచం కోసం ముందుకు రండి | Priyanka Chopra looks stunning at the Miami world premiere | Sakshi
Sakshi News home page

సురక్షిత ప్రపంచం కోసం ముందుకు రండి

Published Thu, Sep 21 2017 1:57 AM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

సురక్షిత ప్రపంచం కోసం ముందుకు రండి

సురక్షిత ప్రపంచం కోసం ముందుకు రండి

న్యూయార్క్‌:  మెరుగైన, సురక్షితమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి అన్ని దేశాల అధినేతలు ముందుకురావాలని ప్రముఖ బాలీవుడ్‌ నటి, యూనిసెఫ్‌ సౌహార్ద్ర రాయబారి ప్రియాంక చోప్రా పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో జరిగిన గ్లోబల్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక.. బాలికల సాధికారతపై ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి మాట్లాడారు.

‘తమదైన సరికొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి వీలుగా బాలికలకు విద్య, సాధికారతలను అందించడంతో పాటు నైపుణ్యాల మెరుగుదలకు మనమందరం కలసికట్టుగా కృషి చేయాలి. వీలైతే వారందరూ(బాలికలు) తమ కలల్ని నెరవేర్చుకునేందుకు, ఆనందంగా నవ్వులు చిందించే సురక్షిత ప్రపంచం కోసం ప్రయత్నించాలి’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement