విదేశీ వర్కర్లకు ఖతార్‌ మరో గుడ్‌న్యూస్‌ | Qatar to simplify residency procedures of expat workers  | Sakshi

విదేశీ వర్కర్లకు ఖతార్‌ మరో గుడ్‌న్యూస్‌

Nov 21 2017 3:10 PM | Updated on Oct 4 2018 7:01 PM

Qatar to simplify residency procedures of expat workers  - Sakshi

విదేశీ కార్మికులకు ఖతార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. విదేశీయులకు నివాస ప్రక్రియలను సులభతరం చేసేందుకు, వారు తమ స్వదేశంలోనే విధానాలన్నింటిన్నీ పూర్తి చేసుకునే వీలు కల్పించింది. ఈ కొత్త ఒప్పందంపై ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సింగపూర్‌కు చెందిన కంపెనీ సంతకాలు చేసుకున్నాయి. ఖతారీ నివాస ప్రక్రియలన్నింటిన్నీ విదేశీ వర్కర్లు తమ స్వదేశంలోనే పూర్తి చేసుకోవచ్చని ఖతార్‌ న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టు చేసినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో ఎనిమిది దేశాలకు వర్తిస్తుంది. భారత్‌, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, ట్యునీషియాలు ఉన్నాయి. ఖతార్‌ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఈ దేశాల వారు 80 శాతం ఉంటారు. 

డీల్‌ ప్రకారం విదేశీయులు తమ మెడికల్‌ చెకప్‌, బయోమెట్రిక్‌ డేటా, ఫింగర్‌ప్రింట్‌, వర్క్‌ కాంట్రాక్టులపై సంతకం అన్ని కూడా ఖతార్‌కు రాకముందే తమ స్వదేశంలోనే పూర్తి చేసుకునే అనుమతి ఉంటుంది. ఈ డీల్‌తో మెడికల్‌ టెస్ట్‌లో విఫలమయ్యారని విదేశీ వర్కర్లను దేశంలోకి తిరస్కరించే కేసులు తగ్గుతాయని తెలిసింది. అక్టోబర్‌ మొదట్లోనే ఖతార్‌ ఈ డ్రాఫ్ట్‌ బిల్లును రూపొందించింది. విదేశీ వర్కర్లు తమ ఉద్యోగులు మారడానికి వీలుగా గతేడాదే ఖతార్‌ ప్రభుత్వం కొత్త లేబర్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement