పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై 15 పాత కేసుల్ని తిరిగి తెరవాలని ఉమ్మడి విచారణ బృందం(జిట్) ఆ దేశ సుప్రీంకోర్టుకు సూచించింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై 15 పాత కేసుల్ని తిరిగి తెరవాలని ఉమ్మడి విచారణ బృందం(జిట్) ఆ దేశ సుప్రీంకోర్టుకు సూచించింది. 1990వ దశకంలో షరీఫ్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని, లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని ఈ కేసులు నమోదయ్యాయి. షరీఫ్ కుటుంబానికి లండన్‌లో భారీగా ఆస్తులున్నాయని గతేడాది ‘పనామా పేపర్స్’లో వెల్లడైన ఆయన పాత్రపై జేఐటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
జూలై 10న ఆరుగురు సభ్యుల జిట్ బృందం.. సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించింది. షరీఫ్ కుటుంబానికి విదేశాల్లో చాలా ఆస్తులున్నాయని.. ఈ నేపథ్యంలో పాత కేసుల్ని తిరిగి తెరవడంతో పాటు కొత్త కేసులు నమోదు చేయాలని జిట్ సిఫార్సు చేసింది. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలుగా షరీఫ్ కొట్టిపడేశారు.