సగం సంపద మిలియనీర్ల చేతుల్లోనే
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో రష్యా తర్వాత అసమానత్వం ఎక్కువగా ఉన్న దేశం భారతేనట. 54 శాతం సంపద మిలియనీర్ల (10 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ ఆస్తిపరులు) దగ్గరే ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. 5,600 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచంలోని మొదటి పది సంపన్న దేశాల్లో భారత్ చోటు దక్కించుకుంది. అయినా, సగటు భారతీయుడు మాత్రం పేదవాడేనని ఈ అధ్యయనం నిర్వహించిన ‘న్యూ వరల్డ్ వెల్త్’ అనే పరిశోధన సంస్థ పేర్కొంది.
ఇక ప్రపంచంలో అత్యధికంగా అసమానతలు కలిగిన దేశం రష్యా అని ఈ నివేదిక తెలిపింది. ఇక్కడ 62 శాతం సంపద మిలియనీర్ల చేతుల్లోనే ఉందట. దేశ సంపదలో 50 శాతం మొత్తం మిలియనీర్ల చేతుల్లోనే ఉంటే ఇక అక్కడ అర్థవంతమైన మధ్య తరగతికి అవకాశాలు తక్కువేనని నివేదిక పేర్కొంది.