
రష్యా దాడుల్లో బగ్దాదీ మృతి!
మాస్కో: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రష్యా ప్రభుత్వం పేర్కొంది. మే 28న సిరియాలోని రఖా పట్టణంలో తాము జరిపిన వైమానిక దాడుల్లో ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్‌బగ్దాదీ మరణించి ఉండొచ్చని శుక్రవారం వెల్లడించింది.
ఐసిస్ నేతలు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు ఈ దాడులు చేశామని, అనంతరం నిఘా వర్గాల సమాచారాన్ని విశ్లేషించి.. బగ్దాదీ మరణించినట్లు అంచనాకు వచ్చామని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ వైమానిక దాడుల్లో ఐసిస్ అగ్రనేతలు సహా 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు రష్యా మీడియా వర్గాలు వెల్లడించాయి. బగ్దాదీ మరణించినట్లు వంద శాతం చేప్పలేమని రష్యా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. బగ్దాదీ మృతిపై గతంలో పలుమార్లు వార్తలు వెలువడ్డా అవి నిజం కాలేదు. .