టెర్రరిజం ఫైనాన్షియర్లకు ఇక కఠిన శిక్షలు | Russia toughens punishment for terrorism financers | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 30 2017 9:47 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

Russia toughens punishment for terrorism financers

మాస్కో: తీవ్రవాదులకు ఆర్థిక సహాయం చేసేవారిపై ఇకపై మరింత కఠిన చర్యలు ఉండనున్నాయి. ఈమేరకు క్రిమినల్‌ లా సవరణలకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్‌ పుతిన్‌ ఆమోదం తెలిపారు. ఈ సవరణలను రష్యా అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం ప్రచురించారు. దీని ప్రకారం తీవ్రవాదానికి ఆర్థిక సహాయం చేసినా, తీవ్రవాదులను నియామకం చేసుకున్నా 8 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 3 లక్షల రూబుల్స్‌ (5,172 డాలర్లు) నుంచి 7లక్షల రూబుల్స్‌ వరకు జరిమానా, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంతకుముందు పదేళ్ల శిక్ష మాత్రమే ఉండేది. టెర్రరిజాన్ని ప్రచారం చేసినా క్రిమినల్‌ లా కిందకు వస్తుందని, అలాంటివారికి 5 నుంచి 7 ఏళ్ల జైలుశిక్షతోపాటు 3 లక్షల నుంచి ఒక మిలియన్‌ రూబుల్‌  వరకు జరిమానా విధిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement