క్షిపణి దాడిలో కుప్పకూలిన సుఖోయ్-25 యుద్ధవిమానం
మాస్కో, రష్యా : అంతర్యుద్ధంలో రాజ్యమేలుతున్న సిరియాలో తిరుగుబాటుదారులు శనివారం రష్యా వార్ జెట్‌ను కూల్చేశారు. పారాచూట్ ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకున్న పైలట్‌ను దారుణంగా కాల్చిచంపారు.
సిరియాలోని నార్త్‌ఇడ్లిబ్ ప్రావిన్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది. హయత్ తెహ్రిర్ అల్-ష్యామ్(హెచ్‌టీఎస్) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పోర్టబుల్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్‌ను ఉపయోగించి సుఖోయ్-25ను కూల్చివేసినట్లు సమాచారం. ఈ దురదృష్ట సంఘటనపై రష్యా రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సిరియా తిరుగుబాటుదారులు జెట్ విమానాన్ని నేలకూల్చినట్లు చెప్పింది. సిరియాలో రష్యా వాయుసేన చేస్తున్న దాడులకు వ్యతిరేకంగానే జెట్‌ను నేలకూల్చినట్లు హెచ్‌టీఎస్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment