అనుకోని అతిథి.. న్యూస్‌ రీడర్‌ షాక్‌ | Russian news broadcast interrupted by a happy dog in studio | Sakshi
Sakshi News home page

అనుకోని అతిథి.. న్యూస్‌ రీడర్‌ షాక్‌

Published Tue, May 23 2017 5:49 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

అనుకోని అతిథి.. న్యూస్‌ రీడర్‌ షాక్‌ - Sakshi

అనుకోని అతిథి.. న్యూస్‌ రీడర్‌ షాక్‌

మాస్కో: ఉదయాన్నే వేడి వేడి వార్తలను చదువుతున్న టీవీ యాంకర్‌ అనుకోని అనుభవంతో షాక్‌కు గురైంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ శునకం.. యాంకర్‌ కాళ్ల దగ్గరకు వచ్చి నిలబడింది. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. దీంతో ఏం చేయాలో పాలుపోని న్యూస్‌ రీడర్‌ వార్తలను చదవడం ఆపకుండా అలానే నెట్టుకురావడానికి ప్రయత్నించింది.

ఓ వైపు చేతితో దాన్ని నిమురుతూనే వార్తలను చదవాలని అనుకుంది. ఇంతలో ఒక్కసారిగా పైకి ఎగిరిన శునకం లైవ్‌ షోలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ షేర్‌ అవుతోంది. మరి మీరు ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement